టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సారెన్ తో కలిసి సందడి చేశారు. జేఎస్‌సీఏ స్టేడియంలో నూతనంగా నిర్మించిన సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థ, సీడీ ఫిట్‌నెస్‌ క్లబ్‌, అధునాతన హంగులతో కూడిన జిమ్‌, అప్‌టౌన్‌ కేఫ్‌ నిర్మించారు. ఈ సందర్బంగా కార్యక్రమనికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ధోని, పలువురు క్రీడాకారులు హాజరయ్యారు.

Also Read మరీ సాగించుకుంటున్నావ్, అరటిపండు తొక్క తీసుకోలేవా: ఆటగాడికి గడ్డిపెట్టిన అంపైర్...

కాగా... ఈ కార్యక్రమంలో సీఎం హేమంత్ సారెన్ తో కలిసి ధోనీ హంగామా చేశారు. ఉల్లి కాడలతో ఈలలు వేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. జార్ఖండ్ స్టేడియంలో ప్రారంభించిన నూతన రెస్టారెంట్లో హేమంత్‌, ధోనీ సహా ప్రముఖులు కాఫీ సేవించారు. అక్కడే ఉన్న ఉల్లి కాడలతో వీరిద్దరూ ఈలలు వేసేందుకు ప్రయత్నించారు. మహేంద్రసింగ్‌ ధోనీ చాలాసార్లు అలా చేసేందుకు ప్రయత్నించారు. 

ఎన్నికల్లో గెలిచినందుకు హెమంత్ సోరెన్‌కు ధోని శుభాకాంక్షలు తెలియజేశారు. హేమంత్ సోరెన్ మౌలిక వసతులను పెద్దపీట వేస్తునందుకు సంతోషంగా ఉందని తెలిపారు. హేమంత్‌ నాయకత్వంలో రాష్ట్రం ఘనత అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని అభిలాషించారు. ఆటగాళ్లందరూ బాగా ప్రాక్టీస్ చేయాలని రంజీ మ్యాచ్ ల్లో రాణించి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని ధోని సూచించారు. అనంతరం సీఎం హేమంత్ సోరేన్ మాట్లాడుతూ.. ఈ స్టేడియం పునాదులు గురూజీ శిబు సొరెన్ వేశారు. బాటలోనే నడిచి రాష్ట్రాన్నిమరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నానాను అని అన్నారు.