మరీ సాగించుకుంటున్నావ్, అరటిపండు తొక్క తీసుకోలేవా: ఆటగాడికి గడ్డిపెట్టిన అంపైర్
క్రికెట్ మ్యాచ్‌ల్లోనూ.. టెన్నిస్ కోర్టుల్లోనూ కొందరు బాల్ బాయ్స్ కానీ, బాల్ గాళ్స్ కానీ ఉంటాన్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే వీళ్లకు ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారుడు అప్పగించిన పనికి చీవాట్లకు గురయ్యాడు
క్రికెట్ మ్యాచ్‌ల్లోనూ.. టెన్నిస్ కోర్టుల్లోనూ కొందరు బాల్ బాయ్స్ కానీ, బాల్ గాళ్స్ కానీ ఉంటాన్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే వీళ్లకు ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారుడు అప్పగించిన పనికి చీవాట్లకు గురయ్యాడు.
Also Read:సెహ్వాగ్ తలపై ఉన్న జట్టు కన్నా ఎక్కువగా... షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
అసలేం జరిగిందంటే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు ఇలియట్ బ్రెంచెట్రిట్ బాల్‌గాళ్‌ను అరటి పండు తొక్క తీసి ఇవ్వమన్నాడు. దీనిపై వెంటనే జోక్యం చేసుకున్న చైర్ అంపైర్ జాన్ బ్లోమ్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అరటిపండు తొక్క కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నావా అంటూ గడ్డి పెట్టాడు. అంతేకాకుండా అరటిపండును ఇలియట్‌కు ఇచ్చేయాల్సిందిగా ఆమెను సూచించాడు. చేసేదిలేక ఇలియటే అరటిపండు తొక్క తీసుకుని తిన్నాడు.
Also Read:అతను స్మార్ట్ క్రికెటర్... ఫలితంతో సంబంధం లేదు.. కేన్ విలియమ్సన్ పై కోహ్లీ
అనంతరం చైర్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. తన చేతికి క్రీమ్ రాసుకున్న కారణంగానే బాల్‌గాళ్ సాయం కోరానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇలియట్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ కోసం పనిచేసే వారిని తన వ్యక్తిగత పనుల కోసం ఎలా ఉపయోగించుకుంటావని ప్రశ్నించారు.