Asianet News TeluguAsianet News Telugu

ఎంఎస్ ధోనీకి నోటీసులు పంపిన సుప్రీం కోర్టు... మాహీని వీడని అమ్రపాలి వివాదం...

2009 నుంచి 2016 వరకూ ఆమ్రపాలి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ... తనకు రావాల్సిన రూ.40 కోట్లు ఇప్పించాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మాజీ కెప్టెన్...

MS Dhoni issued notices by Supreme Court during Amrapali Constructions
Author
India, First Published Jul 26, 2022, 12:13 PM IST | Last Updated Jul 26, 2022, 12:29 PM IST

భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని ఆమ్రపాలి కంపెనీ వివాదం వీడడం లేదు. ఇప్పటికే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కారణంగా అనేక న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొన్న మాహీకి మరోసారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎంఎస్ ధోనీకి నోటీసులు పంపించిన సుప్రీం కోర్టు, ఆమ్రపాలి గ్రూప్‌కి విరుద్ధంగా ఢిల్లీ హై కోర్టు చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని కూడా నిలిపివేయాల్సిందిగా స్టే విధించింది...

టీమిండియాకి కెప్టెన్‌ అయిన కొత్తలో 2009లో ఆమ్రపాలి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు మహేంద్ర సింగ్ ధోనీ. దాదాపు ఏడేళ్లపాటు ఈ కంపెనీని ప్రమోట్ చేసిన మాహీ.. ఆ సమయంలో తనకి రావాల్సిన రూ.40 కోట్ల పారితోషికాన్ని చెల్లించడం లేదంటూ సదరు కంపెనీపై పిల్ వేశాడు...

అయితే గృహ కొనుగోలుదారుల నుంచి వేల కోట్లు వసూలు చేసిన ఆమ్రపాలి, వారికి స్థలాలు కేటాయించకుండా బోర్డు తిప్పేస్తుంది. దీంతో మాహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రమోషన్ కారణంగా ఆమ్రపాలి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన గృహ విక్రయదారులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు...

దీంతో ఆమ్రపాలి పూర్వపు మేనేజ్‌మెంట్ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గృహ కొనుగోలుదారుల ఆసక్తిని కాపాడాలని, జైలులో ఉన్న పాత మేనేజ్‌మెంట్‌తో కొత్త మేనేజ్‌మెంట్, ఢిల్లీ హైకోర్టు సాగిస్తున్న మధ్యవర్తిత్వ ప్రక్రియను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు యు.యు. లలిత్, బేలా ఎం. త్రివేది ఆదేశాలు జారీ చేశారు...

ఆమ్రపాలి సంస్థలో స్థలాలు, గృహాలను కొనుగోలు చేసినవారు సంతృప్తి చెందిన తర్వాత, ఆమ్రపాలిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. అంటే ఆమ్రపాలి సంస్థపై కొనుగోలుదారులు వేసిన కేసు తేలేదాకా, అదే సంస్థపై మహేంద్ర సింగ్ ధోనీ వేసిన కేసులో విచారణ ముందుకు సాగదని తేల్చేసింది సుప్రీం కోర్టు...

ఇప్పటికే ఆమ్రపాలి సంస్థకు  బ్రాండ్ ప్రమోషన్ చేసిన కారణంగా గృహ కొనుగోలుదారులకు రూ.42 కోట్ల దాకా చెల్లించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా ఆమ్రపాలి సంస్థపై కేసు వేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. 

ఆమ్రపాలి నుంచి తనకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేయించాల్సిందిగా 2019లో సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించాడు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. అయితే తాను ప్రమోట్ చేసిన కంపెనీ కారణంగా వందల మంది సాధారణ ప్రజానీకం కోట్లు కోల్పోయారనే విషయాన్ని మాహీ మరిచిపోవడాన్ని సీరియస్‌‌గా తీసుకుని... ఇప్పట్లో ఆ చెల్లింపుల గురించి విచారణ జరిగే ప్రసక్తి లేదని తేల్చేసింది.

2019లో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌బీసీసీ (నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ష్ కార్పొరేషన్)కి ఆమ్రపాలి మొదలెట్టిన రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన పనిని అప్పగించింది సుప్రీం కోర్టు.. అయితే ఈ కంపెనీ, సింకింగ్ ఫండ్ కింద ఆగిపోయిన ప్రాజెక్ట్‌ని పూర్తి చేసేందుకు ఒక్కో చదరపు అడుగుకి రూ.200 అదనంగా చెల్లించాల్సిందిగా కొనుగోలుదారులను కోరింది...

అయితే కొనుగోలుదారులను ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని కంపెనీకి సూచించిన అత్యున్నత్త న్యాయస్థానం, నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఆమ్రపాలి సంస్థకు చెందిన స్థలాలను విక్రయించి రూ.700 కోట్లను జమకూర్చుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios