ఐపిఎల్ సీజన్ 2 లో మరో రసవత్తర సమరానికి అంతాసిద్దమైన సమయ్యింది. మరికొద్దిసేపట్లో చెపాక్ స్టేడియంలో చెన్నై సూపన్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల  మధ్య మ్యాచ్ మొదలవనుంది. అయితే ఈ సమయంలో ఆతిథ్య చెన్నై అభిమానులకు టీంమేనేజ్ మెంట్ షాకిచ్చింది. తీవ్ర జ్వరం కారణంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్ కు దూరమైనట్లు సంచలన ప్రకటన చేసింది. 

ధోని జట్టుకు దూరమవడంతో సురేష్ రైనా మరోసారి చెన్నై సారథ్య బాద్యతలు స్వీకరించారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ధోని విశ్రాంతి  తీసుకోవడంతో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో అతడు మరోసారి జట్టుకు దూరమవడం చెన్నై అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. 

లీగ్ దశలో భాగంగా ఇదివరకు వాంఖడే స్టేడియంలో చెన్నై, ముంబై జట్లు తలపడ్డాయి. అయితేే ఆ మ్యాచ్ లో ముంబైదే పైచేయిగా నిలిచింది. తాజాగా తమ సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో ఆ అడ్వాంటేజ్ ను ఆసరాగా చేసుకుని ముంబై పై ప్రతీకారం తీర్చకోవాలని సూపర్ కింగ్స్ భావించింది. కానీ హటాత్తుగా ధోని అనారోగ్యానికి గురై మ్యాచ్ కు దూరమవడంతో వారి ఆలోచనలన్ని తారుమారయ్యాయి.