క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి వచ్చినంత మాస్ ఫాలోయింగ్ మరో క్రికెటర్‌కి రాలేదనే చెప్పాలి. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్, ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ మంచి ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్నా మాస్ జనాల్లోకి ధోనీ వెళ్లినంత వెళ్లలేకపోయారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో పెద్దగా ప్రభావితం చూపించలేకపోయిన మహేంద్ర సింగ్ ధోనీ... లీగ్ తర్వాత మళ్లీ కుటుంబంతో కలిసి యూఏఈకి చెక్కేశాడు.

అక్కడ భార్యాపిల్లలతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ క్రికెట్ ‘తలైవా’. భార్య సాక్షి సింగ్ ధోనీ బర్త్ డే వేడుకలను దుబాయ్‌లోనే నిర్వహించాడు మాహీ. తాజాగా ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ధోనీ... భార్య, కూతురితో కలిసి ఇలా డ్యాన్స్ చేశాడు. దుబాయ్‌లో సతిందర్ సర్జాత్ లైవ్ పర్ఫామెన్స్‌లో ధోనీ కుటుంబంతో కలిసి చిందులేసి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మాస్‌లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న ధోనీ, ‘క్లాస్’ డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో ఇరగదీశాడని అంటున్నారు ఫ్యాన్స్.