టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ధోనీ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరుపుకున్నాడు. ఆయన కుమార్తె జీవా స్వయంగా దగ్గరుండి తండ్రి బర్త్‌డే వేడుకలను నిర్వహించింది.

ధోని చేయి పట్టుకుని కేక్ కట్ చేయించింది. ఈ సమయంలో టీమిండియా సభ్యులు కేదార్ జాదవ్, హర్డిక్ పాండ్యా ధోని ముఖానికి కేక్ పూసి సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ధోనీ సతీమణి సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy Bday ❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Jul 6, 2019 at 4:18pm PDT