Asianet News TeluguAsianet News Telugu

ధోనీ బైక్ కలెక్షన్ చూసి షాకైన వెంకటేశ్ ప్రసాద్... షో రూమ్ కంటే ఎక్కువ బైకులతో నింపేసిన మాహీ..

రాంఛీలో తన నివాసంలో బైక్స్ కోసం ఓ స్పెషల్ గ్యారేజీ నిర్మించిన మహేంద్ర సింగ్ ధోనీ.. మాహీ బైక్ కలెక్షన్ చూసి షాకైన భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్.. 

MS Dhoni bike collection video shares by Venkatesh Prasad, looks like more than Bike Showroom CRA
Author
First Published Jul 18, 2023, 11:46 AM IST

ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన పిచ్చి ఉంటుంది. కొందరికి ఫోటోలంటే ఇష్టం, మరికొందరికి కరెన్సీ నోట్లను భద్రంగా దాచుకోవడం ఇష్టం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే తాను మొట్టమొదటగా కొన్ని బైక్ దగ్గర్నుంచి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రూపంలో వచ్చిన బైక్స్ దాకా అన్నింటినీ సేకరించి... వాటి కోసం తన ఇంట్లో ఓ ప్రత్యేకమైన గ్యారేజీయే కట్టించాడు మహేంద్ర సింగ్ ధోనీ..

తాజాగా రాంఛీలో మహేంద్ర సింగ్ ధోనీ ఇంటికి వెళ్లిన భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్, మాహీ బైక్ కలెక్షన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ఓ వ్యక్తిలో నేను చూసిన క్రేజీయెస్ట్ ప్యాషన్ ఇదే. అతని దగ్గర ఉన్న కలెక్షన్ చూసి షాక్ అయ్యా. ఎన్నో గొప్ప గొప్ప విజయాలు అందుకున్న సారథి, అంతకుమించి అద్భుతమైన మనిషి. రాంఛీలోని తన ఇంట్లో ఉన్న బైక్స్, కార్ల కలెక్షన్లలో ఓ భాగం ఉంది. ఇతన్ని, ఇతని ప్యాషన్‌ని చూసి నా బుర్ర బద్ధలైపోయింది...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్..

‘ఎవ్వరైనా దీన్ని చూస్తే ఇది కచ్ఛితంగా బైక్ షో రూమ్ అనే అనుకుంటారు. ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి...’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు వెంకటేశ్ ప్రసాద్.. 

‘రాంఛీకి చాలా సార్లు వచ్చా. అయితే లెజెండ్‌ ధోనీని కలవడం ఇదే మొదటిసారి. ఈ మొత్తం సెటప్ గురించి నేనేమీ చెప్పలేను. దీన్ని చూశాక మాటలు రావడం లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ జోషి. 

‘నేను అయితే దీన్ని పిచ్చి అంటా.. ఎందుకు మాహీ.. ఎందుకు ఇదంతా’ అంటూ వీడియో షూట్ చేసిన సాక్షి సింగ్, ధోనీని అడిగింది.. 

‘మా ఆవిడ సాక్షి, నన్ను ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ? ఇన్ని అవసరమా? అని. నేను ఒకటే చెబుతా... నువ్వు నాకోసం అన్నీ చేస్తావు, కానీ నా కోసం నేను కొన్ని చేసుకోవాల్సినవి ఉంటాయి. అందులో ఇదీ ఒకటి. నాకు ఇక్కడ ఓ స్పెషల్ ఫీలింగ్ ఉంటుందని.. ’ అంటూ తన బైక్ కలెక్షన్‌ గురించి చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ.. 

మాహీ బైక్ కలెక్షన్‌లో 100కి పైగా బైక్స్, పదుల సంఖ్యలో కార్లు ఉన్నాయి. వీటిల్లో రూ.30 వేలతో మొదలయ్యే యమహా బైక్ దగ్గర్నుంచి అత్యంత ఖరీదైన కన్ఫిడరేట్ హెల్ క్యాట్ బైక్ కూడా ఉంది. దేశంలో ఏదైనా కొత్త మోడల్ లాంఛ్ అయితే వెంటనే దాన్ని బుక్ చేసి, తన గ్యారేజీకి తెస్తుంటాడు ధోనీ. కొని దాచడం మాత్రమే కాదు, అర్ధరాత్రి దాటిన తర్వాత వీటిల్లో నచ్చిన బైక్ బయటికి తీసి, సరదాగా రోడ్ల మీద చుట్టి వస్తుంటాడు మహేంద్ర సింగ్ ధోనీ.. 

ధోనీ బైక్ కలెక్షన్‌లో కొన్ని ఇవి:
మహేంద్ర సింగ్ ధోనీ దగ్గర 
సుజుకి హయబుస  ధర: రూ.16.41 లక్షలు
కవాసకి నింజా H2 ధర: రూ.35 లక్షలు
కన్ఫిడరేట్ X132 హెల్‌క్యాట్ ధర: రూ.47 లక్షలు
హర్లే డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్ ధర: రూ.21.99 లక్షలు
డుకాటీ 1098 ధర: రూ.35 లక్షలు
నార్టన్ జుబ్లీ 250 ధర: రూ.3 లక్షలు
యమహా ఆర్‌డీ 350  ధర: రూ.30 వేలు
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్  310 ధర: రూ.5 లక్షలు

Follow Us:
Download App:
  • android
  • ios