న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ మీద భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి స్పందించారు. అతి వేగంగా జేబులు కొట్టే దొంగ కన్నా ధోనీ బంతిని అందుకుంటాడని ఆయన అన్నారు. క్రికెట్ క్రీడను చాలా మార్చాడని ఆయన అన్నారు. 

బంతిని అందుకోవడంలో అతి వేగంగా స్పందించడం వల్ల ధోనీ ప్రశంసలు అందుకున్నాడని ఆయన అన్నారు. ధోనీకి మరెవరూ సాటి రారని, ఆటను ఎంతో మార్చాడని, అన్ని ఫార్మాట్లలోనూ ధోనీ అత్యద్భుతమైన ప్రదర్శన చేశాడని అన్నారు. 

ధోనీ బంతిని అందుకుని బ్యాట్స్ మెన్ ను అవుట్ చేయడం తనకు బాగా నచ్చిందని చెప్పారు. అత్యద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు కూల్ గా ఉండేవాడని ఆయన అన్నారు. 

టీ20 ప్రపంచ కప్ ను అందించడమే కాకుండా పలు ఐపిఎల్ టైటిల్స్ కూడా గెలిచాడని ఆయన అన్నారు. టెస్ట్ క్రికెట్ లో భారత్ ను నెంబర్ వన్ స్థానంలో నిలిపాడని ప్రశంసించారు. 90 టెస్టు మ్యాచులుఆడాడని చెప్పారు. 

జీవితాన్ని ఉన్నదున్నట్లుగా స్వీకరించాడని, ఖరగ్ పూర్ లో క్రికెట్ క్రీడలోకి ప్రవేశించింది మొదులు చివరి వరకు తాను చురుగ్గా ఉంటూ వచ్చాడని అన్నారు. వికెట్ కీపింగ్ లో కొత్త ప్రమాణాలను నెలకొల్పాడని చెప్పారు. 

ధోనీ బెయిల్స్ ను పడగొట్టాడని బ్యాట్స్ మెన్ కూడా గుర్తించనంతగా వేగంగా ఉండేవాడని చెప్పారు. క్రికెట్ లో గ్రేట్ కాదు, గ్రెటెస్ట్ అని ధోనీని ఆయన కొనియాడారు.