Deepak Chahar: టీమిండియా ఆల్ రౌండర్ దీపక్ చాహర్.. ఈ నెల 1న ఆగ్రాలో తన గర్ల్ ఫ్రెండ్ జయా భరద్వాజ్ ను కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
‘కోడె నాగు లాంటి వాన్ని వానపాము చేసింది. ఆలి కాదురా అది అనకొండ.. ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తియోగం.. ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం’ అన్నాడో సినీకవి. భార్యా బాధితుల కష్టాలను వర్ణించడానికి ఇదొక ఉదాహరణ. సెలబ్రిటీల నుంచి జేబులో సెల్ కూడా లేని భర్తల వరకు ఇదే బాధ. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ కూడా ఇదే వేదనలో ఉన్నట్టున్నాడు. పెళ్లై నెలరోజులు కూడా కాకముందే మనోడికి ‘భార్య వల్ల కలిగే ఒత్తిడి’ తెలిసొచ్చినట్టుంది.
తాజాగా ఇదే విషయమై తన సోషల్ మీడియా ఖాతాలలో.. వీళ్లను హ్యాండిల్ చేయడం కంటే హై ఓల్టేజీ క్రికెట్ మ్యాచ్ లో ఒత్తిడిని ఎదుర్కోవడం సులభంగా ఉంటుందని రాసుకొచ్చాడు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా చాహల్ ఈ పోస్ట్ చేశాడు. తన పెళ్లి సందర్బంగా చాహర్.. భరద్వాజ్ తో చేసిన డాన్స్ వీడియోను పోస్ట్ చేస్తూ ఈ కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో చాహర్-భరద్వాజ్ లు పలు బాలీవుడ్ పాటలకు కాళ్లు కదిపారు. ఇద్దరూ కలిసి డాన్స్ ఇరగదీశారు.
అయితే చాహర్ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్లు కూడా అంతే వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘మనోడికి నెలరోజులకే తత్వం బోధపడినట్టుంది..’, ‘పాపం.. భార్య పెట్టే కష్టాలు తట్టుకోలేక మరో బాధితుడు బలి..’ అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా.. ఈ ఏడాది వెస్టిండీస్ తో టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డ దీపక్ చాహర్.. ఐపీఎల్ కు కూడా దూరమయ్యాడు. వేలంలో అతడిని రూ. 14 కోట్లు పెట్టి దక్కించున్న చెన్నై సూపర్ కింగ్స్ కు చాహర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం అతడు పెళ్లి చేసుకుని హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత చాహర్.. తిరిగి ఎన్సీఏలో రిహాబిటేషన్ సెంటర్ లో జాయిన్ అవుతాడు. టీ20 ప్రపంచకప్-2023 వరకు సిద్ధమవాలని అతడు భావిస్తున్నాడు.
