తొలి టెస్ట్‌లో సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. సింగిల్ హ్యాండ్‌తో సిరాజ్ అందుకున్న సూపర్ క్యాచ్‌కు జెర్మైన్ బ్లాక్‌వుడ్(14) పెవిలియన్ చేరాడు.
డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. తొలి రోజు ఆట చాలా బాగా జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ తన 33వ ఐదు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 150 పరుగుల వద్ద ముగిసింది. అద్భుతమైన బౌలింగ్ తో ఇండియా అదరగొట్టింది. చాలా వికెట్లు తీసినా, ఒక వికెట్ కి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. అది మరేదో కాదు, సిరాజ్ పట్టిన క్యాచ్.
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. సింగిల్ హ్యాండ్‌తో సిరాజ్ అందుకున్న సూపర్ క్యాచ్‌కు జెర్మైన్ బ్లాక్‌వుడ్(14) పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సిరాజ్ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసాధారణ క్యాచ్ అందుకున్నాడని ప్రశంసిస్తున్నాడు. తొలి రోజు ఆట ఫస్ట్ సెషన్ చివరి ఓవర్ లాస్ట్ బాల్‌కు బ్లాక్‌వుడ్ వెనుదిరిగాడు. జడేజా వేసిన ఆఫ్ స్టంప్ బాల్‌ను బ్లాక్ వుడ్ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు.
కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ పట్టుకునే క్రమంలో సిరాజ్ మోచేతికి గాయం తగిలింది. అయినా కూడా, క్యాచ్ పట్టిన ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
