వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ : మొహమ్మద్ సిరాజ్ దూరం, బీసీసీఐ కీలక ప్రకటన.. కారణమిదే
టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చీలమండ గాయం కారణంగా త్వరలో వెస్టిండీస్‌తో జరిగే వన్డేల సిరీస్‌కు ముందు విశ్రాంతిని ఇస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించింది.

టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చీలమండ గాయం కారణంగా త్వరలో వెస్టిండీస్‌తో జరిగే వన్డేల సిరీస్‌కు ముందు విశ్రాంతిని ఇస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించింది. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో షమీ వంటి సీనియర్ల గైర్హాజరీలో టీమిండియా పేస్ అటాక్‌ను అద్భుతంగా నడిపించాడు సిరాజ్. ఈ సిరీస్‌ను భారత్ 1-0తో గెలిచిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానే, కేఎస్ భరత్, నవదీప్ షైనీలతో కలిసి స్వదేశానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ముందు సిరాజ్‌ను టీమిండియా వన్డే జట్టు నుంచి విడుదల చేసినట్లుగా బీసీసీఐ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. చీలమండ గాయంతో బాధపడుతున్న అతనిని బీసీసీఐ వైద్యుల బృందం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించింది.
గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిరాజ్‌ను టీమిండియా ఎంపిక చేయలేదు. విండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆడిన ఆయన.. ట్రినిడాడ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. వన్డే జట్టులో సిరాజ్ లేకపోవడంతో ఇప్పుడు భారత పేస్ అటాక్స్‌లో జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్‌లు వుండగా.. రిజర్వ్ కేటగిరీలో ముఖేష్ కుమార్ వున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు సిరాజ్ రెస్ట్ లేకుండా ఆడుతున్నాడు. వరుసగా మూడు టెస్ట్‌లో బౌలింగ్ చేస్తూ వచ్చాడు. గాయం కారణంగా అతను నేరుగా ఎన్‌సీఏలోని ఆసియా కప్ క్యాంప్‌ను చేరుకుని ప్రపంచకప్‌లో పాల్గొంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
పీటీఐ నివేదిక ప్రకారం ప్రపంచకప్ కోసం ఉద్దేశించిన భారత ఆటగాళ్లెవరూ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌కు వెళ్లరు. అందువల్ల సిరాజ్ ఐర్లాండ్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం పరిగణనలోనికి తీసుకోలేదు. కానీ శ్రీలంక, పాకిస్తాన్‌లలో జరిగే ఆసియా కప్ కోసం భారత జట్టులో చేరతాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లలో సిరాజ్ పాల్గొన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 2-1 తేడాతో విజయం సాధించడంలో సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 19 వికెట్లు పడగొట్టాడు. జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత జట్టులో సిరాజ్ స్థానం సంపాదించాడు.