Mohammed Shami: భారత్ నుంచి ఒకే ఒక్కడు.. మహ్మద్ షమీ క్రియేట్స్ హిస్టరీ
India vs New Zealand: మహ్మద్ షమీ 17 ఇన్నింగ్స్‌ల్లోనే అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి 19 ఇన్నింగ్స్‌లు తీసుకున్న ఆస్ట్రేలియా పేస్ స్పియర్‌హెడ్ మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును షమీ బద్దలు కొట్టాడు.
Mohammed Shami creates history: భారత బౌలర్ మహ్మద్ షమీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన కేరీర్ లోనే అత్యుత్తమమైన మరో ఇన్నింగ్స్ ను అందించి ఐసీసీ క్రికెట్ వరల్గ్ కప్ 2023 మెగా టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ విజయంలో కీలక పాత్ర పోషించి భారత్ ను ఫైనల్ కు చేర్చాడు. బుధవారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో షమీ ఏడు వికెట్లు తీశాడు. ప్రపంచ కప్ ఒక వన్డే మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా మహ్మద్ షమీ హిస్టరీ క్రియేట్ చేశాడు.
షమీ 7/57తో రాణించడంతో భారత్ కివీస్ ను 327 పరుగులకే ఆలౌట్ చేసి వరల్డ్ కప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. గతంలో స్టువర్ట్ బిన్నీ (6/4) రికార్డును తాజా ఇన్నింగ్స్ తో షమీ అధిగమించాడు. ప్రపంచకప్ లో భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ గణాంకాలు కూడా ఇవే. 2003 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ పై ఆశిష్ నెహ్రా 6/23తో రాణించాడు. ఈ ఇన్నింగ్స్ కంటే సమీ ప్రదర్శన ప్రత్యేకమనే చెప్పాలి.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజీలాండ్ గెలుపు కోసం స్ఫూర్తిదాయకమైన పోరాటం చేసిందనే చెప్పాలి. అయితే, మహ్మద్ షమీ కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది కీవీస్ జట్టు. న్యూజీలాండ్ జట్టులోని కీలకమైన డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీల వికెట్లను పడగొట్టాడు. ఈ ఏడు వికెట్లతో ఈ ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షమీ అగ్రస్థానంలోకి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్ తో ఈ మెగా ఈవెంట్లో వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ చరిత్ర సృష్టించాడు. అలాగే, ప్రపంచ కప్ లో నాలుగు సార్లు ఐదు వికెట్లు తీసిన మొదటి బౌలర్ గా కూడా మహ్మద్ షమీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.