Asianet News TeluguAsianet News Telugu

అశ్విన్ ఒక్కడే కాదు.. నాగ్‌పూర్ టెస్టులో అరుదైన ఘనత సాధించిన షమీ..

Border Gavaskar Trophy: నాగ్‌పూర్ టెస్టులో  మూడో ఆసీస్ ను నిలువరించడంలో  టీమిండియా విజయవంతమైంది. ఈ మ్యాచ్ లో  అశ్విన్ తో పాటు మహ్మద్ షమీ కూడా   అరుదైన ఘనతను అందుకున్నాడు. 

Mohammed Shami Completes  400 Wickets in International Cricket, Joins Elite list MSV
Author
First Published Feb 9, 2023, 7:07 PM IST

బోర్డర్ - గవాస్కర్ ట్రోపీలో భాగంగా  నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  భారత్ బౌలింగ్ కు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే  ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో  రవిచంద్రన్ అశ్విన్..  ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ  ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా  టెస్టులలో  అతి తక్కువ మ్యాచ్ (89)  లలో 450 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అయితే అశ్విన్ తో పాటు టీమిండియా  పేసర్ మహ్మద్ షమీ కూడా ఓ రికార్డును అందుకున్నాడు. 

షమీ.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను తన రెండో ఓవర్లో  తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు.  అంతర్జాతీయ  క్రికెట్ లో షమీకి ఇది 400 వ వికెట్ కావడం గమనార్హం. తద్వారా  400 ప్లస్ వికెట్లు సాధించిన భారత బౌలర్లలో చోటు సాధించాడు.

భారత్ లో  అన్ని ఫార్మాట్ల (ఇంటర్నేషనల్ లెవల్‌లో) లో కలిపి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో  షమీ  9వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో  టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే  అగ్రస్థానంలో నిలిచాడు.  ఆ జాబితాను ఓసారి  చూస్తే.. 

- అనిల్ కుంబ్లే : 953 వికెట్లు.. 
- హర్భజన్ సింగ్ : 707 
- కపిల్ దేవ్ : 687 
- ఆర్. అశ్విన్ : 672
- జహీర్ ఖాన్ : 597
- జవగల్ శ్రీనాథ్ - 551
- రవీంద్ర జడేజా - 482 
- ఇషాంత్ శర్మ - 434 
- మహ్మద్ షమీ -  400 వికెట్లు 

 

అయితే భారత పేసర్ల విషయంలో  చూస్తే మాత్రం షమీ.. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, శ్రీనాథ్, ఇషాంత్ ల తర్వాత ఐదో స్థానంలో ఉన్నాడు. మిగతా వాళ్లంతా స్పిన్నర్లు. షమీ ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్ లో 61 టెస్టులు ఆడి  217 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేలలో 159 వికెట్లు, 23 టీ20లలో  24 వికెట్లు తీశాడు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios