ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది.. క్రికెట్ ఆస్ట్రేలియా సారీ చెప్పింది. అయినా అక్కడి ప్రేక్షకులకు మాత్రం బుద్ధి రాలేదు. మరోసారి మన ఆటగాళ్లపై జాత్యంహర వ్యాఖ్యలు చేశారు.

బ్రిస్బేన్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా బౌలర్లు సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌లను టార్గెట్ చేశారు. సుందర్, సిరాజ్‌లను దూషించారు ఆసీస్ ఆడియన్స్.

వారం రోజుల్లో సిరాజ్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. సిడ్నీలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వరుసగా రెండు రోజులు బుమ్రా, సిరాజ్‌లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.

దీనిపై టీమిండియా అంపైర్లకు ఫిర్యాదు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్, జడేజా, హనుమ విహారి గాయాలతో ఈ టెస్టు మ్యాచ్‌కి దూరమవగా.. వారి స్థానాల్లో నటరాజన్, శార్ధూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్ టీమ్‌లోకి వచ్చారు.

దాంతో.. కేవలం రెండు టెస్టుల అనుభవం ఉన్న మహ్మద్ సిరాజ్ టీమిండియా బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్నాడు. టి. నటరాజన్‌, సుందర్‌కి ఇదే తొలి టెస్టు మ్యాచ్.