ఓటమికి నైతిక బాధ్యత.. కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్న మహమ్మద్ నబీ..

ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అఫ్గానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్లో విషయం షేర్ చేశాడు. 

mohammad nabi steps down afghanistan captian after t20 world cup defeats

ఆఫ్ఘనిస్తాన్ : టి 20 ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. శుక్రవారం అడిలైడ్ ఓవల్ లో జరిగిన ఆస్ట్రేలియా- అఫ్గానిస్తాన్ మ్యాచ్ లో నాలుగుపరుగుల తేడాతో కంగారూలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టుకు కెప్టెన్సీ పదవి నుంచి మహ్మదర్ నబీ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని నబీ శుక్రవారం స్వయంగా తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ‘‘మా టి20 వరల్డ్ కప్ ప్రయాణం నేటితో ముగిసింది. ప్రపంచకప్లో మాకు నచ్చిన ఫలితాలు మాకు కానీ,  మా మద్దతుదారులకు కానీ నచ్చలేదు. 

ఓటమికి బాధ్యత వహిస్తూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఒక సంవత్సరం నుంచి మా జట్టు కెప్టెన్ కోరుకునే స్థాయికి లేదా పెద్ద టోర్నమెంట్ కు అవసరమైన స్థాయిలో లేదు. పైగా గత కొన్ని పర్యటనలో జట్టు మేనేజ్మెంట్ సెలక్షన్ కమిటీ నేను ఒకే పేజ్ లో లేము. ఇది జట్టు బ్యాలెన్స్ పై ప్రభావాన్ని చూపించింది. అందుకే కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించాను. 

అఫ్గాన్ ఓడి ఇంటికెళ్లింది.. ఆసీస్ గెలిచినా సెమీస్‌కు కష్టమే..! లంకమీదే కొండంత ఆశలు..

ఇదే విషయాన్ని మేనేజ్మెంట్ కి చెప్పాను. కెప్టెన్ గా తప్పుకున్నప్పటికీ ఒక ఆటగాడిగా మాత్రం కంటిన్యూ అవుతాను. ఇన్నాళ్లు కెప్టెన్ గా మద్దతు ఇచ్చిన జట్టు సహచరులతో పాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వర్షం కారణంగా రెండు మ్యాచ్లు దెబ్బతిన్నప్పటికీ మాపై అభిమానంతో మైదానాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ నిజంగా మాకు చాలా ముఖ్యమైనది. లవ్ యూ అఫ్గానిస్తాన్’ అంటూ ముగించాడు.

మొహమ్మద్ నబీ కెప్టెన్గా ఎంపికయ్యాక ఆఫ్ఘనిస్తాన్ గోల్డెన్ డేస్ చూసింది. అతని హయాంలోనే ఆ జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తొలిసారి టాప్ టెన్ లోకి వచ్చింది. 2017లో టెస్ట్ హోదా కూడా పొందింది. మహమ్మద్ నబీ  అఫ్గానిస్తాన్ కెప్టెన్ గా 28 వన్డేలు, 35 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios