Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup:బుమ్రా అత్యుత్తమ బౌలర్.. పాక్ క్రికెటర్ ప్రశంసలు..!

టీమిండియా బౌలర్ బుమ్రా పై ప్రశంసలు కురిపిస్తూ...షాహీన్ అఫ్రీది ని విమర్శలు కురిపించడం గమనార్హం. పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రీది, భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ల మధ్య పోలికలను  అమీర్ ఓ మీడియాతో మాట్లాడారు. ది బెస్ట్ బౌలర్ బుమ్రా  అంటూ పొగడ్తలు కురిపించారు.
 

Mohammad Amir Terms India Pacer As "Best T20 Bowler", Says Comparisons With Shaheen Afridi "Foolish"
Author
Hyderabad, First Published Oct 23, 2021, 3:19 PM IST

T20 World Cupలో భాగంగా ఆదివారం భారత్- పాకిస్తాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రపంచకప్ లో ఇప్పటి వరకు భారత్ పై పాక్ గెలిచింది లేదు. ఇదే రేపు కూడా పునరావృతం కానుందని భారతీయ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్ నేపథ్యంలో.. తాజాగా.. పాక్ క్రికెటర్ మొహమ్మద్ అమీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా బౌలర్ బుమ్రా పై ప్రశంసలు కురిపిస్తూ...షాహీన్ అఫ్రీది ని విమర్శలు కురిపించడం గమనార్హం. పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రీది, భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ల మధ్య పోలికలను  అమీర్ ఓ మీడియాతో మాట్లాడారు. ది బెస్ట్ బౌలర్ బుమ్రా  అంటూ పొగడ్తలు కురిపించారు.

Also read: T20 Worldcup 2021 AUS vs SA: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... సఫారీ జట్టుపై భారీ అంచనాలు

పాక్ పేసర్ షాహీన్ యువకుడు అని.. అతనిని బుమ్రాతో పోల్చలేమని.. అది మర్ఖత్వమని పేర్కొన్నాడు.  బుమ్రా.. గత కొంతకాలంగా టీమిండియాలో రాణిస్తున్నాడని.. అతను అత్యుత్తమ టీ20 బౌలర్  అని తాను అనుకుంటున్నట్లు అమీర్ పేర్కొన్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ లో చాలా బాగా ఆడతాడని తాను అనుకుంటున్నట్లు చ ెప్ాడు.

"షహీన్ ఈసారి పాకిస్థాన్ అత్యుత్తమ బౌలర్. గత ఏడాదిన్నర కాలంగా అతను రాణిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కాబట్టి.. రేపటి మ్యాచ్ బాగా జరిగే అవకాశం ఉంది ’’ అని మొహమ్మద్ పేర్కొన్నాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది . ఇరు జట్లు తమ ప్రచారాన్ని విజయంతో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన భారత వార్మప్ గేమ్‌లో బుమ్రా 26 పరుగులిచ్చి నాలుగు ఓవర్లలో వికెట్ తీశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఇతర వార్మప్ మ్యాచ్‌లో పేసర్ కనిపించలేదు.

సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అఫ్రిది ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగంగా ఉన్నాడు . నాలుగు ఓవర్లలో రెండు డిస్మిల్స్ నమోదు చేశాడు, 41 పరుగులు ఇచ్చాడు.

అతను బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఇతర వార్మప్ క్లాష్‌లో కూడా ఆడాడు మరియు నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios