ఐపీఎల్ వేలంలో రూ. 7 కోట్లకు మొయిన్ ఆలీని కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్...జెర్సీపై అల్కహాల్ బ్రాండ్ లోగో తొలగించాలని కోరిన మొయిన్ ఆలీ... అంగీకరించిన సీఎస్‌కే...

ఐపీఎల్ అంటేనే పక్కా కమర్షియల్ లీగ్. కొత్త కొత్త స్పాన్సర్లకు తగ్గట్టుగా ప్రతీ ఏటా జెర్సీలో కూడా మార్పులు చేస్తుంటాయి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు... 2021 సీజన్‌కి చెన్నై సూపర్ కింగ్స్‌ ఆవిష్కరించిన కొత్త జెర్సీలో ఓ అల్కహాల్ బ్రాండ్‌కి సంబంధించిన లోగో కూడా ఉంది.

ఈ లీగ్‌లో జట్టులో చేరిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ, ఆ అల్కహాల్ బ్రాండ్ లోగోను తొలగించాల్సిందిగా సీఎస్‌కేని కోరాడు. అల్కహాల్‌ను తాగడం కానీ, తాగడాన్ని ప్రోత్సాహించే లోగోలను కానీ ధరించడం ఇష్టం లేదని, తన మత నమ్మకాన్ని బయటపెట్టాడు మొయిన్ ఆలీ.

అతని వినతిని అంగీకరించిన చెన్నై సూపర్ కింగ్స్, మొయిన్ ఆలీ కోసం ఆ లోగో లేకుండా మరో జెర్సీని రూపొందించి ఇచ్చిందట. 33 ఏళ్ల మొయిన్ ఆలీని చెన్నై సూపర్ కింగ్స్ 2021 మినీ వేలంలో రూ. 7 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే...