Asianet News TeluguAsianet News Telugu

ఖేల్‌రత్నకు అశ్విన్‌, మిథాలీ పేర్లు.. కేంద్రానికి బీసీసీఐ సిఫారసు

క్రీడా పురస్కారాలకు సంబంధించి దేశంలోని క్రీడా సంఘాలన్నీ క్రీడాకారుల పేర్లను సిఫార్సు చేస్తున్నాయి. జూన్‌ 21తో ముగిసిన గడువును పొడిగించడంతో జాబితాలు సిద్ధం చేస్తున్నాయి. బీసీసీఐ, ఫుట్‌బాల్‌, రెజ్లింగ్‌, హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ తదితర సంఘాలు ఇప్పటికే కొందరి పేర్లను ప్రస్తావించాయి.  
 

Mithali Raj and Ravichandran Ashwin recommended for Khel Ratna by BCCI ksp
Author
Mumbai, First Published Jun 30, 2021, 4:43 PM IST

క్రీడా పురస్కారాలకు సంబంధించి దేశంలోని క్రీడా సంఘాలన్నీ క్రీడాకారుల పేర్లను సిఫార్సు చేస్తున్నాయి. జూన్‌ 21తో ముగిసిన గడువును పొడిగించడంతో జాబితాలు సిద్ధం చేస్తున్నాయి. బీసీసీఐ, ఫుట్‌బాల్‌, రెజ్లింగ్‌, హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ తదితర సంఘాలు ఇప్పటికే కొందరి పేర్లను ప్రస్తావించాయి.  ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్నకు సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, టీమిండియా మహిళల వన్డే, టెస్టు సారథి మిథాలీ రాజ్‌ పేర్లను బీసీసీఐ సిఫార్సు చేసింది. అర్జున అవార్డు కోసం శిఖర్‌ ధావన్‌, కేల్‌ రాహుల్‌, జస్ప్రీత్‌ బుమ్రా పేర్లను ప్రతిపాదించింది.  

అంతర్జాతీయ క్రికెట్లో 22 ఏళ్లు పూర్తి చేసుకున్న మిథాలీ రాజ్ వన్డేల్లో 7000కు పైగా పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. ఇక స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ 79 టెస్టుల్లో 413, వన్డేల్లో 150, టీ20ల్లో 42 వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలకంగా నిలుస్తున్నాడు. శ్రీలంక పర్యటనలో భారత్‌కు సారథ్యం వహిస్తున్న శిఖర్‌ ధావన్‌ పేరును బీసీసీఐ మరోసారి సిఫారసు చేసింది. గతేడాది అతడిని పురస్కారం వరించలేదు. బుమ్రా, రాహుల్‌ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో దూసుకెళ్తున్నారు.

Also Read:చెత్త పారేసి.. రూ. 5వేలు జరిమానా కట్టిన క్రికెటర్.. ! 

భారత రెజ్లింగ్‌ సమాఖ్య సైతం నలుగురి పేర్లను అర్జున పురస్కారాల కోసం సిఫారసు చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన రవి దహియా, దీపక్‌ పునియా, అన్షు మలిక్‌, సరితను ఇందుకోసం ఎంపిక చేశారు. మరోవైపు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య టీమ్‌ఇండియా సారథి సునిల్‌ ఛెత్రీ పేరును రాజీవ్‌ ఖేల్‌ రత్న కోసం సిఫార్సు చేసింది. కాగా, గతేడాది ఒకేసారి ఐదుగురిని రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు ఎంపిక చేయడం క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనికా బాత్రా, క్రికెటర్‌ రోహిత్‌ శర్మ, రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌, హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌, పారాలింపిక్స్‌ హైజంప్‌ ఆటగాడు మరియప్పన్‌ తంగవేలుకు ఈ పురస్కారం అందజేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios