MI vs SRH : ముంబై బౌలింగ్ ను తీన్మార్ ఆడేసిన హైద‌రాబాద్.. బౌండ‌రీలతో ద‌ద్ద‌రిల్లిన స్టేడియం.. !

Hyderabad vs Mumbai Indians :  ఐపీఎల్ 2024 8వ మ్యాచ్ లో బౌండ‌రీల మోత మోగింది. ముంబై బౌలింగ్ ను చిత్తు చేసిన హైదరాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ బౌండ‌రీల వ‌ర్షం కురిపించారు. దీంతో ఏం చేయాలో తెలియక ముంబై దిమ్మ‌దిరిగిపోయింది. 
 

MI vs SRH: Hyderabad dusted off Mumbai's bowling.. Travis Head, Abhishek Sharma's record half-centuries in IPL 2024 RMA

Travis Head - Abhishek Sharma : ఏం బ్యాటింగ్ గురూ మీరు త‌ప్ప‌కుండా చూడాల్సింది. ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ బౌలింగ్ ను ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు ఏం టీమ్ కూడా చీల్చిచెండాడ‌ని విధంగా ఇప్పుడు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ తీన్మార్ ఆడేసింది. బౌల‌ర్ ఎవ‌రైనా స‌రే బౌండ‌రీల మోత మోగిపోయింది. సిక్స‌ర్లు, ఫోర్ల‌తో హైద‌రాబాద్ బ్యాట‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ లు ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డులు సృష్టిస్తూ హాఫ్ సెంచ‌రీలు కొట్టారు.

ఈ మ్యాచ్ లో మొద‌ట ట్రావిస్ హెడ్ ముంబై బౌల‌ర్ల‌పై సునామీల విరుచుకుప‌డ్డాడు. ఆ త‌ర్వాత అభిషేక్ శ‌ర్మ దెబ్బ‌కు మ్యాచ్ అప్ప‌టికే వ‌న్ సైడ్ ద‌శ‌కు వ‌చ్చేసిన ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. బ్యాట‌ర్స్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్ట‌డంతో 7 ఓవ‌ర్ల‌కే సెంచ‌రీ కొట్టింది హైద‌రాబాద్ టీమ్. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 ప‌రుగులు కొట్టాడు. త‌న ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్ లో అత్యంత వేగంగా తొలి హాఫ్ సెంచ‌రీ సాధించిన ప్లేయ‌ర్ గా కూడా నిలిచాడు. కేవ‌లం 18 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టాడు.

ట్రావిస్ హెడ్ ఔట్ అయ‌న త‌ర్వాత యంగ్ ప్లేయ‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌న విశ్వ‌రూపం చూపించాడు. వ‌రుసగా ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ ఐపీఎల్ 2024లో రికార్డు హాఫ్ సెంచ‌రీ సాధించాడు. కేవ‌లం 16 బంతుల్లోనే బౌండ‌రీల మోత మోగిస్తూ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. అభిషేక్ శ‌ర్మ 23 బంతుల్లో 63 ప‌రుగుల చేసి ఔట్ అయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాదాడు. వీరిద్ద‌రి సూప‌ర్ బ్యాటింగ్ కు 15 ఓవ‌ర్ల‌కే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్కోర్ 200 ప‌రుగుల మార్కును అందుకుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios