Asianet News TeluguAsianet News Telugu

IPL 2024: ఇదేం కెప్టెన్సీరా బాబు.. హార్థిక్ పై ట్రోల్స్.. 

IPL 2024: ఐపీఎల్‌-2024లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఘెరంగా ఓటమి పాలైంది. కెప్టెన్‌గా తన వ్యూహాలను అమలు చేయడంలో హార్దిక్‌ విఫలమవుతున్నాడు. దీంతో పాండ్యా నెటింట్లో దారుణంగా ట్రోల్స్ కు గురవుతున్నారు . 

MI vs RR, IPL 2024: Pressure piles up on Hardik Pandya as Mumbai lose 3 in a row krj
Author
First Published Apr 2, 2024, 1:23 AM IST

IPL 2024: ఐపీఎల్‌-2024లో టాప్ టీమ్ ముంబై ఇండియన్స్ కు ఏమైంది. హార్దిక్ పాండ్యాపై  కెప్టెన్సీలోని ముంబై వరుసగా మూడు సార్లు ఓటమి పాలైంది. సోమవారం నాడు ముంబై హోం గ్రౌండ్ వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఘోరపరాభం ఎదురైంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్‌ పరంగానూ, ఇటు బౌలింగ్ పరంగానూ రెండింటిలో ముంబై విఫలమైంది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ రాజస్తాన్‌ బౌలర్ల దాటికి గజగజలాడింది. రాజస్తాన్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, స్పిన్నర్‌ చాహల్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టి ముంబై నడి విరిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్యా(34), తిలక్‌ వర్మ (32) పరుగులు చేశారు.  

ఆ తరువాత 126 పరుగుల స్వల్ప లక్ష్యచేధనకు వచ్చిన రాజస్తాన్ బ్యాట్స్ మెన్స్ ముంబై బౌలర్లను ఉతికి ఆరేశారు. కేవలం 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్ మెన్స్ లో రియాన్‌ పరాగ్‌ తన పరాక్రమాన్ని చూపించాడు. కేవలం 39 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 54 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌తో రియాన్ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ లో నిలిచారు. 

ఇదేం కెప్టెన్సీ  

ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై వరుసగా మూడుసార్లు అపరాజయం పాలు కావడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి పెరిగింది. అలాగే అభిమానుల్లో ఆయన పై తీవ్ర సంత్రుప్తి చెలారేగుతోంది. వాస్తవానికి ఎన్నో అనూష్య పరిణామాల తరువాత హర్థిక్ పాండ్యా ఈ ఏడాది ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. కానీ, తన ప్రత్యేకతను చాటుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు హర్థిక్ కెప్టెన్సీలో  ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఘెరంగా ఓటమి పాలైంది. పాండ్యా జట్టు విజయం కోసం ఎన్ని వ్యూహాలను రచించినా.. వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. 

రోహిత్‌కు అవమానం 

ఐపీఎల్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా..  రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ స్థానాన్ని మార్చడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ స్థానాన్ని ప‌దేప‌దే మార్చడంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి గురయ్యాడు. కామన్ గా  30 యార్డ్ స‌ర్కిల్‌లో ఉండే రోహిత్ శర్మను ఈ మ్యాచ్ లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ కు పంపించారు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవ‌ర్‌లో రోహిత్‌ శర్మను ఫస్ట్ మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేయ‌మ‌ని , తర్వాత లాంగాన్‌కు వెళ్లమ‌ని సూచించాడు హర్ధిక్. దీంతో రోహిత్ ప‌రిగెత్తుకుంటూ లాంగాన్‌ లో ఫిల్డింగ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్‌ అవుతోంది.  

ట్రోల్స్

ఇలా కెప్టెన్సీపరంగా విఫలమైన హర్థిక్ పాండ్యాను నెటింట్లో దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇదేం కెప్టెన్సీ రా బాబు..,  హర్థిక్  పాండ్యాను తొలగించి..  రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ  ఇవ్వండయ్యా అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.  

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios