IPL 2024, MI vs RR: విజృంభించిన పరాగ్.. వరుసగా మూడోసారి ముంబై ఓటమి..
IPL 2024, MI vs RR: ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్‌తో చేతితో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి రాజస్థాన్‌కు 126 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తరువాత లక్ష్య చేధన కు వచ్చిన రాజస్థాన్ 27 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది.
IPL 2024, MI vs RR: ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్‌తో చేతితో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి రాజస్థాన్‌కు 126 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తరువాత లక్ష్య చేధన కు వచ్చిన రాజస్థాన్ 27 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. ముంబై ఇండియన్స్‌కి ఇది వరుసగా మూడో ఓటమి. రాజస్థాన్‌కు ఇది వరుసగా మూడో విజయం. హోం గ్రౌండ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ రియాగ్ పరాగ్ 39 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి ముంబైకి 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో ముంబై టాప్ ఆర్డర్ నిరాశపరిచింది. రోహిత్ శర్మ, నమన్ ధీర్ రూపంలో జట్టుకు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ తన మెరుగైన బౌలింగ్‌తో రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్లు ముంబై బ్యాట్స్‌మెన్‌పై విధ్వంసం సృష్టించారు. తిలక్ వర్మ,హార్దిక్ పాండ్యా మధ్య ఐదో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని 76 పరుగుల వద్ద చాహల్ బ్రేక్ చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్ నిలిచారు. హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో 34 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో ముంబైకి వెన్నుదన్నుగా తిలక్ వర్మ నిలిచారు.29 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు మెరుగైన స్కోర్ అందించారు. వీరు కాకుండా ముంబై ఇండియన్స్‌లోని మిగతా బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ హావా చాటారు. ఈ ఇరువురు బౌలర్లు చెరో 3 వికెట్లు పడగొట్టారు. అలాగే. నాండ్రే బెర్గర్ 2 వికెట్లు తీశారు.