ఇండియన్ ప్రీమియర్ లీగ్ అద్భుతంగా రాణించి ముంబై ఇండియన్స్ ని విజేతగా నిలపడంతో బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా పాత్ర మరిచిపోలేనిది. సీజన్ 12 ఆరంభం నుండి ఎప్పుడు జట్టు కష్టాల్లో వున్నా తన బౌలింగ్ తో మాయ చేశాడు. ఇక ఫైనల్లో అతడు 19 వ ఓవర్లో పొదుపుగా బౌలింగ్ చేసి బ్రావో వికెట్ పడగొట్టిన తీరు అద్భుతం. అదే మ్యాచ్ ను మలుపుతిప్పింది. ఇలా బిగ్ మ్యాచ్ లో జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇవన్ని అతడికి ఎంత సంతోసాన్నిచ్చాయో తెలీదు కానీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంస మాత్రం బుమ్రాకు మనసుని తాకినట్లుంది.

చెన్నై సూపర్ కింగ్స్ పై ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన అనంతరం సచిన్, యువరాజ్ లు సరదాగా ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ బుమ్రా బౌలింగ్ గురించి మాట్లాడుతూ అతన్ని ఆకాశానికెత్తేశాడు. బుమ్రా వంటి మేటి బౌలర్ ప్రపంచ క్రికెట్లో మరెవ్వరు లేరని పేర్కొన్నారు. అతడు ఈ ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని విజేతగా నిలబెట్టాడని అన్నారు. అంతేకాదు భవిష్యత్ మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచ కప్ మెగా టోర్నీలో బుమ్రా సేవలు భారత జట్టుకు ఎంతో ఉపయోగడతాయని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్ అని సచిన్ పొగిడారు.
అయితే ఈ వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారిక ట్విట్టర్ పేజిలో పోస్ట్ చేసింది. దీనిపై తాజాగా స్పందించిన బుమ్రా క్రికెట్ లెజెండ్ సచిన్ తననలా పొగుడుతుంటే చాలా ఆనందంగా అనిపించిందన్నారు. '' నాకు మాటలు రావడం లేదు.. థ్యాంక్యూ సచిన్ సర్'' అంటూ బుమ్రా ఆ వీడియోపై కామెంట్ చేశాడు.
ఈ ఐపిఎల్ సీ న్ మొత్తంలో బుమ్రా 16 మ్యాచుల్లో 6.63 ఎకానమీ 19 వికెట్లు తీశాడు. హైదరాబాద్ లో జరిగిన ఫైనల్లో నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ చేసి కేవలం 14 పరగులు మాత్రమే రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో బుమ్రాను అభిమానులే కాదు మాజీలు, విశ్లేషకులు పొగడ్తలు కురిపిస్తున్నారు.