దశాబ్ద కాలంలో న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2010లో  అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు.

ముంబయి వేదికగా... టీమిండియాతో న్యూజిలాండ్ రెండో టెస్టు సిరీస్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో.. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అదరగొట్టాడు. సెంచరీతో మెరుపులు కురిపించాడు. అంతేకాకుండా... మయాంక్.. ఓ అరుదైన రికార్డును కూడా సాధించాడు. దాదాపు 11 సంవత్సరాలుగా.. న్యూజిలాండ్ పై ఏ ఇండియన్ ఓపెనర్ సాధించలేని ఘనత మయాంక్ సాధించడం గమనార్హం.

Also Read: రోహిత్ శర్మ ఫిక్స్... హిట్‌మ్యాన్‌తో ఓపెనింగ్‌కి ఆ ముగ్గురి పోటీ... మయాంక్ అగర్వాల్ సెంచరీతో...

దశాబ్ద కాలంలో న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2010లో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు.

Also Read: మొన్న బ్యాటుతో, నేడు బాల్‌తో... ఎవరీ అజాజ్ పటేల్? ముంబైలో పుట్టి, టీమిండియాపైనే ఇలా...

ఆ తర్వాత టీమిండియా ఓపెనర్‌ ఎవరూ కూడా సెంచరీ సాధించలేదు. తాజాగా కివీస్‌పై మయాంక్‌ సెంచరీ సాధించి ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా న్యూజిలాండ్‌పై 2014 తర్వాత సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2014 లో ఆక్లాండ్‌ వేదికగా కివీస్‌పై శిఖర్‌ ధావన్‌ శతకం నమోదు చేశాడు. కాగా మయాంక్‌ ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో నాలుగో సెంచరీ. ముఖ్యంగా నాలుగు సెంచరీలు కూడా స్వదేశంలో చేసినవే కావడం గమానార్హం.