Asianet News TeluguAsianet News Telugu

క్యాచ్ పట్టబోయిన మార్క్ వుడ్‌ని తోసేసిన మాథ్యూ వేడ్... ఛీటర్ అంటూ ట్రోల్స్ మొదలు..

క్యాచ్ పట్టబోయిన మార్క్ వుడ్‌ని చేతులతో తోసేసిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్... ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తొలి టీ20లో హై డ్రామా... 

Matthew Wade clearly obstructed Mark Wood, drama in England vs Australia 1st T20I
Author
First Published Oct 9, 2022, 8:02 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో హాట్ ఫెవరెట్లుగా బరిలో దిగుతున్నాయి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్... డిఫెండింగ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది ఇంగ్లాండ్ జట్టు. హోరాహోరీగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌‌లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది...

ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆస్ట్రేలియా విజయానికి 4 ఓవర్లలో 40 పరుగులు కావాల్సిన పరిస్థితుల్లో ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ 17వ ఓవర్ బౌలింగ్‌కి వచ్చాడు. తొలి బంతికి డేవిడ్ వార్నర్ సింగిల్ తీయగా రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి షాట్ ఆడబోయిన మాథ్యూ వేడ్, గాల్లోకి బంతి లేపాడు. అది అక్కడే ‌పైకి లేచింది. 

గాల్లోకి లేచిన బంతిని అందుకునేందుక బౌలర్ మార్క్ వుడ్‌ ప్రయత్నిస్తుండగా మాథ్యూ వేడ్‌ అతన్ని పట్టుకుని గట్టిగా లాగుతూ ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. మార్క్ వుడ్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు గాల్లోకి లేచిన బంతి, కిండ పడిపోయింది...

ఐసీసీ నిబంధనల ప్రకారం క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్న బౌలర్‌ని కానీ ఫీల్డర్‌ని కానీ ఉద్దేశపూర్వకంగా ఆపినా, అడ్డుకున్నా ఆ బ్యాటర్‌ని అవుట్‌గా ప్రకటించాలి అంపైర్లు. అయితే కొద్దిసేపు చర్చించుకున్న ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ని అప్పీలు చేయాల్సిందిగా కోరారు. అయితే బట్లర్ అప్పీలు చేయకపోవడంతో థర్డ్ అంపైర్‌‌కి రిఫర్ చేయలేదు....

అయితే రిప్లైలో గాల్లోకి లేచిన బంతి ఎక్కడ తనపై పడుతుంతో తెలియక మాథ్యూ వేడ్‌ భయపడుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. అంటే బంతిని మార్క్ వుడ్ క్యాచ్ అందుకోబోతున్నాడని తెలిసే మాథ్యూ వేడ్ అతన్ని అడ్డుకున్నాడు...

ఇంతకుముందు ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తూ క్రీజు ముందుకి వచ్చిన అప్పటి పాక్ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్, భారత ఫీల్డర్ వేసిన బంతిని వికెట్లకు తాకకుండా బ్యాటుతో అడ్డుకున్నాడు. అప్పుడు అంపైర్లు ఇంజమామ్ వుల్ హక్‌ని అవుట్‌గా ప్రకటించారు. 

అలాంటిది క్యాచ్ అందుకునేందుకు వస్తున్న మార్క్ వుడ్‌ని కావాలని చేతితో అడ్డుకున్న మాథ్యూ వేడ్‌ని ఎందుకు నాటౌట్‌గా ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాథ్యే వేడ్‌ని ఛీటర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

‘నేను బాల్‌వైపే చూస్తున్నా, ఏం జరుగుతుందో గమనించలేదు. అప్పీలు చేస్తారా అని అంపైర్లు అడిగారు. అయితే ఆస్ట్రేలియాలో చాలా రోజులు ఉండాలి. టూర్‌ని ఇలా ప్రారంభించడం రిస్క్ అనిపించి అప్పీలు చేయలేదు...’ అని కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్...

అయితే ఇది జరిగిన మూడో బంతికి డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్ దాకా క్రీజులో ఉన్న మాథ్యూ వేడ్, ఆస్ట్రేలియా విజయానికి 4 బంతుల్లో 12 పరుగులు కావాల్సిన దశలో అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం కాగా 7 పరుగులే చేసిన ఆస్ట్రేలియా 8 పరుగుల తేడాతో ఓడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios