DC vs CSK : ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరన చిరుతలా కదులుతూ.. పక్షిలా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ క్యాచ్ పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది చూసి ధోనీ కూడా అతనికి ఫిదా అయ్యాడు.
Matheesha Pathirana super catch : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ 13వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్ మతిషా పతిరన అద్భుతంగా రాణించాడు. బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. యార్కర్లతో ఢిల్లీ ఆటగాళ్లను హడలెత్తించాడు. ఫీల్డింగ్ లో సూపర్ మ్యాన్ లా కదులుతూ అద్భుతమైన క్యాచ్ లను పట్టారు. ఈ మ్యాచ్‌లో మతిషా పతిరన ఒంటి చేత్తో ఫ్లయింగ్ క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది చూసి ధోనీ కూడా అతనికి ఫిదా అయ్యాడు.
మతిషా పతిరన సూపర్ క్యాచ్..
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ సమయంలో ఓపెనింగ్ జోడీ పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్దారు. 10వ ఓవర్‌ను ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేయగా, అతనికి బంతిని అప్పగించాలన్న ధోనీ వ్యూహం మతిషా పతిరన అద్భుత క్యాచ్‌తో సఫలమైంది. ఈ ఓవర్ మూడో బంతికి డేవిడ్ వార్నర్ (52 పరుగులు) రివర్స్ స్వీప్ కొట్టాడు. ఒక్క క్షణం బంతి ఫోర్‌కి వెళుతుందని అనిపించినా, షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద నిలబడిన మతీష పతిరన .. చిరుతపులిలా గాల్లోకి దూకి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ పట్టాడు. దీంతో స్టేడియంలో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సూపర్ క్యాచ్ కు ధోనీ రియాక్షన్ వైరల్..
మతిషా పతిరన అద్భుతమైన క్యాచ్ చూసిన ధోనీ కూడా అతనిని పొగడకుండా ఉండలేకపోయాడు. ధోనీ తనదైన శైలిలో పతిరనా ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టాడని కొనియాడాడు. ఢిల్లీ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కూడా షాక్ అయ్యాడు. వార్నర్ ఔట్ అయ్యాడంటే ఒక్క క్షణం నమ్మలేకపోయాడు. చివరికి నిరాశతో పెవిలియన్ కు చేరాడు.
బౌలింగ్‌లోనూ దుమ్మురేపిన మతిషా పతిరన ..
ఈ క్యాచ్ తర్వాత బౌలింగ్ కు దిగిన పతిరన తన డెడ్లీ యార్కర్ బంతులతో ఢిల్లీ బ్యాటర్లను హడలెత్తించాడు. కీలక వికెట్లు తీసుకున్నాడు. 15వ ఓవర్ వేసిన పతిరానా అద్భుతంగా యార్కర్ బంతులు వేసి ముందుగా మిచెల్ మార్ష్, ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ కు పెవిలియన్ కు చేర్చాడు. చాలా కాలం తర్వాత హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ను కూడా ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా, డేవిడ్ వార్నర్‌లు శుభారంభం చేసి తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. వార్నర్ 52 పరుగులు చేసిన తర్వాత ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. పృథ్వీ షా 43 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్‌లో పృథ్వీకి ఇదే తొలి మ్యాచ్. కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 51 పరుగులు చేశాడు.
సూపర్ మ్యాన్ ల సూపర్ క్యాచ్.. బౌలింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టిన రషీద్ ఖాన్..
