మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. అతడు ఏం చేసినా ఓ సెన్సేషన్ గా మారుతోంది. టీమిండియా వెస్టిండిస్ పర్యటన నుండి విశ్రాంతి తీసుకుని ధోని భారత ఆర్మీతో రెండు నెలల పాటు గడపనున్న విషయం తెలిసిందే. ఇలా దేశ ఆర్మీ పట్ల ధోని చూపిస్తున్న అభిమానం, అంకితభావం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే గతంలో ధోని ఆర్మీ దుస్తుల్లో కనిపించిన ఓ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోపై మహింద్రా ఆండ్ మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్ర కాస్తా చమత్కారంతో కూడిన ట్వీట్ చేశాడు. 

గతంలో కొన్ని సందేశాత్మక, వ్యక్తిత్వ వికాసాన్ని, మానవతా విలువలతో కూడిన ట్వీట్స్ ద్వారా ఆనంద్ మహింద్రాకు సోషల్  మీడియాలో ఫ్యాన్ పాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే అతడి వద్దకు ధోనికి సంబంధించిన ఓ వీడియో చేరింది. ఇందులో ధోని ఆర్మీ దుస్తుల్లో మహింద్రా సంస్థకు సంబంధించిన వాహనంలోనే ప్రయాణించడం  కనిపిస్తుంది. దీంతో ఆనంద్ మహింద్రా ఒకేసారి ధోనిని ప్రశంసిస్తూనే...తన సంస్థ(వాహనాన్ని పేర్కొంటూ)కు సంబంధించిన ప్రమోషన్ కూడా కానిచ్చేశాడు. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను ఆయన ఫాలో అయ్యారన్నమాట. 

ఇది మూడేళ్ల క్రితం నాటి వీడియో.  నా వద్దకు వాట్సాప్ వండర్ బాక్స్ ద్వారా చేరింది. ఈ వీడియోలో ధోని ఆర్మీ దుస్తుల్లో చాలా బాగున్నాడు.  అలాగే అతడు ప్రయాణించిన వాహనం కూడా చాలా బాగుంది.'' అంటూ ధోనిని  ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అయితే ఆయన స్పెషల్ గా ధోని ప్రయాణించిన వాహనం కూడా బాగుందని అనడానికి ఓ కారణం వుంది. 

ధోని ప్రయాణించిన వాహనం మహింద్రా సంస్థకు చెందిన ఎక్స్‌యూవి 500. అందువల్లే  ఓ వైపకె ధోనిని పొగుడుతూనే పనిలో పనిగా తమ సంస్థకు చెందిన వాహనాన్ని ప్రమోట్ చేశారు ఆనంద్ మహింద్రా.