Asianet News TeluguAsianet News Telugu

గంభీర్ కి మానసిక సమస్య.. మరోసారి నోరుపారేసుకున్న అఫ్రీది

ప్రపంచంలో ఎంతో మానసిక స్థైర్యం ఉన్న జట్టు ఇండియా. కానీ వారిలో గంభీరే అందరికన్నా మానసికంగా బలహీనుడంటూ అఫ్రిదీ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 

Like Gautam Gambhir the cricketer but not as a human being: Shahid Afridi
Author
Hyderabad, First Published Jul 20, 2020, 9:04 AM IST

పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రీది మరోసారి తన నోటి దురదను ప్రదర్శించాడు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుండే అఫ్రీది మరోసారి ఇండియన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు చేశాడు. గంభీర్ ని కించపరుస్తూ కామెంట్స్ చేశాడు.

ఓ బ్యాట్స్‌మన్‌గా గంభీర్‌ను తాను ఇష్టపడతానని, కానీ అతడి వ్యక్తిత్వం మాత్రం తనకు నచ్చదని అఫ్రిదీ చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఫ్రిదీ భారత మాజీ ఓపెనర్ గంభీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

‘క్రికెట్ పరంగా నేను గంభీర్ అటతీరును ఎంతగానో ఇష్టపడతాను. కానీ వ్యక్తిగతంగా మాత్రం అతడు ఏదో మానసిక సమస్యలతో బాధపడుతున్నాడనేది నా అభిప్రాయం. ప్రపంచంలో ఎంతో మానసిక స్థైర్యం ఉన్న జట్టు ఇండియా. కానీ వారిలో గంభీరే అందరికన్నా మానసికంగా బలహీనుడం’టూ అఫ్రిదీ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 

దీనికి ఉదాహరణగా అప్పట్లో భారత జట్టు మెంటార్‌గా పనిచేసిన ప్యాడీ అప్టాన్ వ్యాఖ్యలను గుర్తుచేశాడు. ‘అప్టాన్ భారత జట్టుతో కలిసి 2009 నుంచి 2011 వరకు పనిచేశారు. అతడు తన పుస్తకంలో కూడా గంభీర్‌ గురించి అనేక ఆసక్తికర విషయాలను వివరించారు. సెంచరీ కొట్టినా గంభీర్ సంతృప్తి చెందేవాడు కాదని, ఎప్పుడూ ఏదో విషయంలో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉండేవాడని అతడు రాసుకొచ్చారు.  దానిపై గంభీర్‌తో ఎన్నో సార్లు మాట్లాడినా ఫలితం లేకపోయిందని తన పుస్తకంలో ప్యాడీ పేర్కొన్నాడు. దీని ద్వారా గంభీర్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు’ అంటూ అఫ్రిదీ వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉంటే ప్యాడీ పుస్తకంలో తన గురించి ఉన్న విషయాలపై గంభీర్ కూడా అప్పట్లో స్పందించాడు. ‘జట్టును ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంచాలనేదే నా కోరిక. అందుకనే సెంచరీ చేసినంత మాత్రాన సంతృప్తి చేందను. జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాలనే నా ఆశయంలో నా సెంచరీ విలువెంత..? అందుకే ఇంకా ఏదో సాధించాలనే తపనతో ఉండేవాడిని. అలా ఉండడాన్ని నేనెప్పుడూ తప్పుగా అనుకోను. అయితే విలువైన ఆటగాడిగా జట్టు బాధ్యతను నా భుజాలపైనే ఎక్కువగా మోయాలనుకునేవాడినం’టూ గంభీర్ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ట్విటర్ వేదికగా షాహిద్ అఫ్రిదీకి కూడా గంభీర్ అనేకసార్లు చురకలంటించాడు.


 

Follow Us:
Download App:
  • android
  • ios