ఇంగ్లాండ్‌లోని లీస్టర్‌ నగరంలో క్రికెట్ గ్రౌండ్‌కి సునీల్ గవాస్కర్ పేరు... పెవిలియన్‌ గోడపై భారత మాజీ క్రికెటర్ చిత్రపటం... 

భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్‌కి అరుదైన గౌరవం దక్కనుంది. ఇంగ్లాండ్‌లోని లిస్టర్‌షైర్ క్రికెట్ గ్రౌండ్‌కి సునీల్ గవాస్కర్ పేరు పెట్టబోతున్నారు. భారత జట్టుకి కెప్టెన్, బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన సునీల్ గవాస్కర్, టెస్టుల్లో 10 వేల పరుగులు, 34 సెంచరీలు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

ఇంగ్లాండ్‌లో ఓ క్రికెట్‌ గ్రౌండ్‌కి భారత క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. ‘లీస్టర్‌ గ్రౌండ్‌ని నా పేరు పెట్టడం గర్వంగా భావిస్తున్నా. లీస్టర్‌ నగరంలో క్రికెట్ ఫ్యాన్స్‌ ఎక్కువ, వారిలో చాలామంది భారత క్రికెట్‌ టీమ్‌ని సపోర్ట్ చేస్తారు. అందుకే ఈ గ్రౌండ్‌కి నా పేరు పెట్టడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

భారత సంతతకి చెందిన ఇంగ్లాండ్ ఎంపీ కేత్ వాజ్, లీస్టర్‌కి మూడు దశాబ్దాలుగా పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందిస్తున్నాడు. కేత్ వాజ్ కారణంగానే లీస్టర్‌కి సునీల్ గవాస్కర్ పేరు పెట్టబోతున్నారు. 

Scroll to load tweet…

‘సునీల్ గవాస్కర్ ఓ లివింగ్ లెజెండ్. ఆయన క్రికెట్‌లో ఎన్నో రికార్డు బ్రేకింగ్ పర్ఫామెన్స్‌లు ఇచ్చారు. ఆయన కేవలం లిటిల్ మాస్టర్ మాత్రమే కాదు, క్రికెట్‌లో గ్రేట్ మాస్టర్ కూడా... లీస్టర్‌లో ఉన్న భారతీయులందరూ సునీల్ గవాస్కర్ ఇక్కడికి వచ్చినప్పుడు సాదరంగా స్వాగతం పలికాం. ఇప్పుడు బ్రిటన్‌లో ఇదీ ఓ భాగం. ఎప్పటికీ గవాస్కర్, మా చరిత్రలో స్థానం పొందబోతున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు కేత్ వాజ్...

ఈ గ్రౌండ్‌లో ఓ పెవిలియన్‌ గోడలపై సునీల్ గవాస్కర్ భారీ చిత్రపటాన్ని గీశారు. బ్యాటు పట్టుకుని నిలబడిన సునీల్ గవాస్కర్ ఫోటో మీద ‘గవాస్కర్ గ్రౌండ్’ అని రాసి ఉంది. 73 ఏళ్ల సునీల్ గవాస్కర్, 51.12 సగటుతో 125 టెస్టుల్లో 10,122 పరుగులు చశాడు. ఇందులో రికార్డు స్థాయిలో 34 సెంచరీలు కూడా ఉన్నాయి. 108 వన్డేలు ఆడిన సునీల్ గవాస్కర్, 3092 పరుగులు చేసి 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు... క్రికెట్ నుంచి వీడ్కోలు ఇచ్చిన తర్వాత కామెంటేటర్‌గా సేవలు అందిస్తున్నాడు సునీల్ గవాస్కర్...

సునీల్ గవాస్కర్ నెలకొల్పిన 34 టెస్టు సెంచరీల రికార్డును భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. సునీల్ గవాస్కర్ క్రికెట్‌లో కొనసాగింత కాలం ‘లిటిల్ మాస్టర్’ నిక్ నేమ్‌తో పిలవబడితే, ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా ఇదే నిక్‌ నేమ్‌తో పాపులారిటీ దక్కించుకున్నాడు...