Asianet News TeluguAsianet News Telugu

KXIPvsKKR: తడబడినా మంచి స్కోరు చేసిన కోల్‌కత్తా... పంజాబ్ ఈసారైనా కొడతారా?

తొలిసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన దినేశ్ కార్తీక్.... 

శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ...మరోసారి బ్యాటింగ్‌లో ఫెయిల్ అయిన ఆండ్రూ రస్సెల్...

KXIP vs KKR: Dinesh Karthik captain innings helped kkr to big score CRA
Author
India, First Published Oct 10, 2020, 5:22 PM IST

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 4 పరుగులకే అవుట్ కాగా నితీశ్ రాణా 2 పరుగులకే రనౌట్ అయ్యాడు. 14 పరుగులకే 2 వికట్లు కోల్పోయిన దశలో శుబ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది కేకేఆర్.

అయితే సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్... తొలిసారి దూకుడు చూపించాడు. వరుస బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ 47 బంతుల్లో 5 ఫోర్లతో 57 పరుగులు చేసి రనౌట్ కాగా... 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న దినేశ్ కార్తీక్... 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో  58 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆండ్రూ రస్సెల్ 5 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపర్చాడు. 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌‌లకి తలా ఓ వికెట్ దక్కింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios