Asianet News TeluguAsianet News Telugu

KXIP vs CSK: వార్ వన్‌సైడ్... ఈజీ విక్టరీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్..

హాఫ్ సెంచరీలతో చెలరేగిన డుప్లిసిస్, షేన్ వాట్సన్...

హ్యాట్రిక్ ఓటముల తర్వాత గ్రాండ్ విక్టరీతో కమ్ బ్యాక్ ఇచ్చిన ధోనీ టీమ్... 

KXIP vs CSK: Chennai Super Kings Easy victory against Kings XI Punjab CRA
Author
India, First Published Oct 4, 2020, 11:07 PM IST

IPL 2020లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని తేలిగ్గా ఆడుతూ పాడుతూ చేధించింది. సీజన్‌లో తొలిసారిగా షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడం, డుప్లిసిస్‌తో కలిసి మొదటి వికెట్‌కి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో చేధనలో చెన్నై ఎక్కడా ఇబ్బంది పడలేదు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్లు తీయలేకపోయారు. రాహుల్ ఈ మ్యాచ్‌కి ముందు చేసిన మార్పులతో జట్టులోకి వచ్చిన బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపించలేక భారీగా పరుగులు ఇచ్చారు. దీంతో ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆడుతూ పాడుతూ బౌండరీలు బాదాడు డుప్లిసిస్, షేన్ వాట్సన్. వీరిద్దరూ మొదటి వికెట్‌కి జత చేసిన పరుగులే ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కి అత్యధిక భాగస్వామ్యం.

షేన్ వాట్సన్ 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగులు చేయగా... డుప్లిసిస్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 87 పరుగులు చేశాడు. వరుసగా హ్యాట్రిక్ ఓటములు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్... కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టి అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పాయింట్ల పట్టికలో కిందికి దిగజారడంతో పాటు ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఇక్కడి నుంచి జరిగే ప్రతీ మ్యాచ్ వారికి చాలా కీలకం కానుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios