టీమిండియా మాజీ  కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పై బౌలర్ కుల్దీప్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్త గత రెండు రోజులుగా ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రచారాన్ని కుల్దీప్ తాజాగా ఖండించాడు. తాను ధోనికి వ్యతిరేకంగా మాట్లాడలేనని...మీడియా, సోషల్ మీడియాలో నా మాటలను   వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నట్లు కుల్దీప్ తెలిపాడు. 

గత సోమవారం సెయెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ లో కుల్దీప్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు ''ధోని కూడా మానవ మాత్రుడేనని, ఆయన కూడా తప్పులు చేస్తారు. మ్యాచ్ సందర్భంగా ఎన్నోసార్లు ఆయనిచ్చిన సూచనలు పనిచేయలేవు.'' మాట్లాడినట్లు కొన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం జరిగింది. అదికాస్తా సోషల్ మీడియాలో  కూడా బాగా ప్రచారమైంది. దీంతో కుల్దీప్ పై ధోని అభిమానులు విరుచుకుపడున్నారు. 

దీంతో ఈ వివాదం పెద్దదవుతుండటంతో కుల్దీప్ దీనిపై స్పందిచాడు. '' ఎటువంటి కారణం లేకుండానే నన్ను ఈ వివాదంలోకి లాగింది. ధోనికి వ్యతిరేకంగా నేను కామెంట్‌ చేసినట్టుగా వచ్చిన వార్తలు అవాస్తవం. నేను ఎవరి మీద అనవసర వ్యాఖ్యలు చేయలేదు. మహి భాయ్‌ అంటే నాకు చాలా గౌరవం'' అంటూ ఇన్‌స్టామ్‌  ద్వారా కుల్దీప్ వివరణ ఇచ్చాడు.