ముంబై ఇండియన్స్ జట్టులో కాస్త ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే... అందరికీ గుర్తొచ్చే పేరు కృనాల్ పాండ్యా. కేవలం స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి అన్న కావడం వల్ల, అప్పుడప్పుడు వికెట్లు తీస్తే... బ్యాటింగ్ వచ్చినప్పుడు హిట్టింగ్ చేస్తూ ఛాంపియన్ టీమ్‌లో కొనసాగుతున్నాడు కృనాల్ పాండ్యా. 

వన్డే టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో చేసిన కృనాల్ పాండ్యా, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2వ ఓవర్‌లోనే బౌలింగ్‌కి వచ్చాడు. ట్రెంట్ బౌల్ట్ మొదటి ఓవర్‌లో కేవలం 1 పరుగు మాత్రమే ఇస్తే, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ చెరో సిక్సర్ బాది 15 పరుగులు రాబట్టారు.

అయితే పంజాబ్ కింగ్స్ విజయానికి 30 బంతుల్లో 33 పరుగులు కావాల్సిన దశలో మరోసారి కృనాల్ పాండ్యాకి బంతి అందించాడు రోహిత్. ఆ ఓవర్‌లో రెండు డాట్ బాల్స్ వేసిన కృనాల్ పాండ్యా, ఆ తర్వాతి బంతికి సింగిల్ ఇచ్చాడు.

క్రిస్ గేల్‌కి వేసిన మొదటి బంతిని వైడ్‌గా వేసిన కృనాల్ పాండ్యా, ఆ తర్వాతి బంతి బౌండరీకి వెళ్లడంతో ఒత్తిడికి గురయ్యాడు. గేల్‌కి బౌలింగ్‌ చేస్తున్నాననే ప్రెషర్‌తో వరుసగా రెండు వైడ్లు వేశారు.

దీంతో ఏం చేయాలో తెలియక ఫీల్డర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు కృనాల్ పాండ్యా.  పాండ్యా బ్రదర్ చేసిన ఈ పని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బౌలర్ వైడ్‌లు వేస్తే, ఫీల్డర్ మాత్రం ఏం చేయగలడు పాపం..