ముంబై: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబై ఇండియన్స్ క్రికెటర్ కృనాల్ పాండ్యాకు చుక్కెదురైంది. ఆయనను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అడ్డుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని బంగారాన్ని, ఇతర విలువైన వస్తువులను కలిగి ఉండడంతో ఆయనను విమానాశ్రయంలో ఆపేశారు. 

ఐపీఎల్ -13 చాంపియన్ ముంబై జట్టు సభ్యుడైన కృనాల్ గురువారం యూఏఈ నుంచి వచ్చాడు. పరిమితికి మించి బంగారం ఉండడంతో పాటు ఇన్ వాయిస్ లేని వస్తువులు కొనుగోలు చేయడంతో ఆయనను ఆపేసినట్లు డీఆర్ఐ వర్గాలు చెప్పాయి.

గురువారం సాయంత్రం కృనాల్ ముంబై విమానాశ్రయానికి వచ్చాడు. ఆ సమయంలో ఆయనను ఆపేశారు. ముంబై ఇండియన్స్ ఐపిఎల్ ఫైనల్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటిల్స్ మీద విజయం సాధించి కప్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

కృనాల్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. బంతితో పాటు బ్యాట్ తోనూ తన జట్టు విజయం సాధించడంలో తన వంతు పాత్ర నిర్వహించాడు.