Asianet News TeluguAsianet News Telugu

సన్ రైజర్స్‌పై నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ... రస్సెల్స్ వీరవిహారం

సన్‌రైజర్స్ హైదరాబాద్... నైట్ రైడర్స్ ముందు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 3 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. వార్నర్ 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అయితే రస్సెల్ వీరవిహారంతో సన్ రైజర్స్ హైదరాబాదుపై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

Kolkata vs Hyderabad, 2nd Match, live updates
Author
Kolkata, First Published Mar 24, 2019, 4:10 PM IST

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సూపర్ విక్టరీ సాధించింది. నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ రస్సెల్ చెలరేగడంతో భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. అంతకు ముందు నితీష్ రానా ధనా ధన్ ఇన్నింగ్స్ తో 68 పరుగులతో ఆకట్టుకోగా ఆ  తర్వాత రస్సెల్స్ కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మ్యాచ్ సన్ రైజర్స్ వైపు మొగ్గుచూపిన సమయంలో రస్సెల్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ చివరి నిమిషంలో రెచ్చిపోయి వరుసగా రెండు  సిక్సర్లతో విన్నింగ్ షాట్స్ కొట్టాడు. 

మొత్తానికి సొంత గ్రౌండ్ లో కోల్ కతా జట్టు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మొదటి విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో షకీబ్, రషీద్ ఖాన్, కౌల్, సందీప్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే చివరి ఓవర్లలో మాత్రం రస్సెల్స్ ని అడ్డుకోలేకపోయారు. 

భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ జట్టు 118 పరుగుల వద్దే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ధనా ధన్ షాట్లతో అదరగొట్టిన నితిష్ రానా ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. దీంతో కలకత్తా జట్టు నాలుగో వికెట్ చేజార్చుకుంది.

ఓ వైపు వికెట్లు పడుతున్నా నైట్ రైడర్స్ బ్యాట్ మెన్ నితీష్ రానా తమ  మార్క బ్యాటింగ్ తో రెచ్చిపోతూ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 36 బంతుల్లోనే 50 పరుగులనను పూర్తి చేసుకున్నాడు.కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ధినేశ్ కార్తిక్ అభిమానులను నిరాశపర్చాడు. రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి జారుకుంటున్న జట్టును ఆదుకోవడంలో విపలమయ్యాడు. కేవలం 2 పరగులు మాత్రమే చేసి సందీప్ శర్మ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. 

నిలకడగా ఆడుతూ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్న సమయంలో నైట్ రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. 87 పరుగుల వద్ద రాబిన్ ఊతప్ప ను కౌల్ క్లీన్ బౌల్డ్ చేశారు. ఇలా ఉతప్ప 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ విసిరిని 182 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంతో నైట్ రైడర్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ లిన్ సిక్సర్లో ఇన్నింగ్స్ ప్రారంభించి మంచి ఊపుమీద కనిపించినా ఆ వెంటనే ఔటయ్యాడు. షకిబ్ అల్ హసన్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్... నైట్ రైడర్స్ ముందు 182 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 3 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. వార్నర్ 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో రస్సెల్ 2, పీయూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టారు.

సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఆల్‌రౌండర్ యూసఫ్‌ పఠాన్ 1 పరుగుకే రస్సెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.వార్నర్ తృుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. దూకుడుగా ఆడిన అతను బెయిర్‌స్టోతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి.

సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చావ్లా బౌలింగ్‌లో ఓపెనర్ బెయిర్‌స్టో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడుతూ అర్థసెంచరీ సాధించాడు. 32 బంతుల్లో వార్నర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇది ఐపీఎల్‌లో అతనికి 37వ అర్థ శతకం.

ఐపీఎల్ -2019లో 2వ మ్యాచ్ ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios