Asianet News TeluguAsianet News Telugu

KKR : చ‌రిత్ర సృష్టించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ సునీల్ న‌రైన్..

Sunil Narine : కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన తొలి ఆటగాడిగా వెస్టిండీస్ లెజెండరీ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. ఈ సంవత్సరం కేకేఆర్ కోసం అత్యధిక ప‌రుగులు చేసిన 36 ఏళ్ల క్రికెటర్ మ‌రో ఘ‌త‌న కూడా అందుకున్నాడు.
 

Kolkata Knight Riders star Sunil Narine has created history by becoming the most valuable player of IPL 2024 KKR RMA
Author
First Published May 27, 2024, 8:56 AM IST

KKR Sunil Narine : ఫైన‌ల్ పోరులో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చిత్తు చేసి ఐపీఎల్ 2024 ఛాంపియ‌న్ గా నిలిచింది కోల్‌కతా నైట్ రైడర్స్‌. అయితే, కేకేఆర్ తో కలిసి మూడు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా వెస్టిండీస్ లెజెండరీ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. ఫైపీఎల్ 2024 ఫైనల్ రోజున తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్న నరైన్..  2012 నుంచి కేకేఆర్ లో కొన‌సాగుతున్నాడు. అత‌ను 2012, 2014లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ లో రెండు టైటిళ్లను గెలుచుకున్నాడు. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం ఐపీఎల్ 2024లో 3వ టైటిల్‌ను గెలుచుకున్నాడు. 

అలాగే, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్ లు సునీల్ న‌రైన్ తో 2014లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమ్ లో ఉన్నారు. ప్ర‌స్తుత జ‌ట్టులోనూ వీరు ఉన్నారు. కేకేఆర్ తో రెండు ఐపీఎల్ టైటిళ్లను సాధించిన ఆటగాళ్ల జాబితాలో గౌతమ్ గంభీర్, ర్యాన్ టెన్ దోస్చాట్, మన్విందర్ బిస్లా, దేబబ్రతా దాస్, జాక్వెస్ కలిస్, యూసుఫ్ పఠాన్, షకీబ్ అల్ హసన్‌లు ఉన్నారు. ఈ సీజ‌న్ లో కేకేఆర్ కోసం అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా కూడా నిలిచాడు. న‌రైన్ 14 మ్యాచ్‌లలో 488 పరుగులు చేశాడు. అలాగే, 17 వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజ‌న్ లో ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో కేకేఆర్ ఛాంపియ‌న్ గా నిల‌వ‌డంలో కీరోల్ పోషించాడు.

మిచెల్ స్టార్క్ పై కేకేఆర్ రూ. 24.75 కోట్లు కుమ్మరించింది ఇందుకే.. !

అలాగే, సునీల్ నరైన్ ఐపీఎల్ 2024లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో నాల్గవసారి అత్యుత్తమ వ్యక్తిగత బహుమతిని గెలుచుకున్న రికార్డును తిర‌గ‌రాశాడు. 2024కి ముందు 2012, 2017, 2018లో  మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును సునీల్ న‌రైన్ గెలుచుకున్నారు. అత‌ని త‌ర్వాత షేన్ వాట్సన్, ఆండ్రీ రస్సెల్ రెండు సార్లు మాత్ర‌మే ఈ అవార్డును అందుకున్నారు. 

 


IPL 2024 ఫైనల్లో సన్‌రైజర్స్ ఓటమి.. ఏడ్చేసిన కావ్య మార‌న్.. వీడియో

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios