టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డ్ లాంటి వాడన్నారు. అంకిత భావం, కఠిన సాధనతో కోహ్లీ సూపర్‌స్టార్‌గా ఎదిగాడని లారా వ్యాఖ్యానించాడు.

కేఎల్ రాహుల్, రోహిత్ కన్నా అతడు మరింత ప్రతిభావంతుడేమీ కాదని.. మ్యాచ్‌కు సన్నద్ధం కావడం అతడిని మరోస్థాయికి తీసుకెళ్లాయని లారా తెలిపాడు. 1948ల నాటి బ్రాడ్‌మన్ జట్టు.. 1970ల నాటి క్లైవ్ లాయిడ్ జట్టు ఇలా ఏ తరానికి చెందిన గొప్ప జట్లలోనైనా కోహ్లీకి స్థానం ఉంటుందన్నాడు.

Also Read:జడేజా రనౌట్... ఇది నేనెప్పుడూ చూడలేదు... విరాట్ కోహ్లీ

అన్ని ఫార్మాట్లలోనే 50కి పైగా సగటు నమోదు చేయడం అత్యంత అరుదైన విషయమని లారా కొనియాడాడు. మరోవైపు ప్రపంచకప్‌ ఫైనల్‌లో 84 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌ అందించిన బెన్‌స్టోక్స్‌ను సైతం బ్రియాన్ లారా ప్రశంసించాడు.

Also Read:రిషబ్ పంత్ మారడు: అదే షాట్, అదే ఔట్

అటు విండీస్ క్రికెటర్ల డబ్బు కోసమే ప్రైవేట్ లీగుల్లో ఆడతారన్న కథనాలను లారా ఖండించాడు. కరేబియన్లు ఎప్పటి నుంచో ప్రైవేటు లీగుల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని.. అదే సమయంలో జాతీయ జట్టుకూ సేవలందించారని లారా స్పష్టం చేశాడు. దేశంలో క్రికెట్ పునర్వైభవానికి బోర్డు స్పష్టమైన ప్రణాళికతో పనిచేయాలని ఆయన హితవు పలికాడు.