టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న వ్యక్తులు అంపైర్ ని మళ్లీ రివ్యూ అడగమని ఫీల్డర్లకు చెప్పడం తాను ఇప్పటి వరకు చూడలేదని కోహ్లీ అన్నాడు. వాళ్లు అడగగానే.. మళ్లీ చూసి ఔట్ అని చెప్పారని కోహ్లీ తెలిపారు.
విండీస్ తో తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ ని వెస్టిండీస్ కైవసం చేసుకుంది. దీని సంగతి పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా రనౌట్ అవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన రనౌట్ పై తీసుకున్న నిర్ణయం పై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా.... ఈ విషయంపై తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.
జడేజా రనౌట్ విషయంలో ఫీల్డర్ ని అడిగితే అంపైర్ నాటౌట్ గా ప్రకటించారని.. అయితే.... టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న వ్యక్తులు అంపైర్ ని మళ్లీ రివ్యూ అడగమని ఫీల్డర్లకు చెప్పడం తాను ఇప్పటి వరకు చూడలేదని కోహ్లీ అన్నాడు. వాళ్లు అడగగానే.. మళ్లీ చూసి ఔట్ అని చెప్పారని కోహ్లీ తెలిపారు. అంపైర్లు మళ్లీ ఆ రనౌట్ ని పరిశీలించి..ఫీల్డ్‌లో జరిగే దాన్ని స్టేడియంలో కూర్చున్న అభిమానులు నిర్ణయించేలా అవకాశం ఇవ్వరని ఆశిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు.
AlsoRead రవీంద్ర జడేజా ఔట్ ఎఫెక్ట్: అంపైర్ పై విరాట్ కోహ్లీ ఆగ్రహం...
ఇంతకీ ఏం జరిగిందంటే... 48వ ఓవర్‌లో కీమో పాల్ వేసిన బంతిని జడేజా మిడ్ వికెట్ వైపు ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే రోస్టన్ చేజ్ నేరుగా విసిరిన బంతి నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో వికెట్లను గిరాటేయగా అప్పటికి జడేజా తన బ్యాట్‌ను క్రీజులో పెట్టలేదు. అయితే మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లు కూడా జడేజా రనౌట్ విషయం గమనించకపోగా, ఫీల్డర్లు కూడా అప్పీల్ చేయలేదు. కానీ భారీ స్ర్కీన్‌పై రీప్లేలో జడేజా రనౌటైనట్టు కనిపించింది. అలాగే తమ డ్రెస్సింగ్‌రూమ్ నుంచి సిగ్నల్ రావడంతో విండీస్ కెప్టెన్ పొలార్డ్ వెంటనే అంపైర్‌ను సంప్రదించాడు.
దీంతో ఇరువురు అంపైర్లు కాసేపు చర్చించాక థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. దీంతో జడేజాను అవుట్‌గా ప్రకటించారు. అయితే అంత సమయం వేచి చూశాక అవుటివ్వడంపై కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బౌండరీలైన్ దగ్గరికొచ్చి అసహనాన్ని వ్యక్తం చేయడం కనిపించింది. ఇదిలావుండగా రనౌట్‌పై ఆటగాళ్లు నేరుగా అప్పీల్ చేయకున్నా కూడా స్ర్కీన్‌పై చూసిన తర్వాత ఫోర్త్ అంపైర్ నిర్ణయాన్ని కోరడం ఎంతవరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది.
