షోయబ్ అక్తర్ ని ఐసీసీ నిషేధించడానికి కారణం ఇదే అంటూ సెహ్వాగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అక్తర్ బౌలింగ్ గురించి మాట్లాడాడు. అక్తర్ బౌలింగ్ చేసే సమయంలో తన మోచేతిని కదిలిస్తూ చేస్తాడని చెప్పాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. గతంలో జరిగిన చాలా విషయాల గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. కాగా.. తాజాగా ఆయన పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
షోయబ్ అక్తర్ ని ఐసీసీ నిషేధించడానికి కారణం ఇదే అంటూ సెహ్వాగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అక్తర్ బౌలింగ్ గురించి మాట్లాడాడు. అక్తర్ బౌలింగ్ చేసే సమయంలో తన మోచేతిని కదిలిస్తూ చేస్తాడని చెప్పాడు.

'' అక్తర్ తన ఎల్బోను కదలిస్తూ బౌలింగ్ చేసేవాడు. ఈ తరహా బౌలింగ్‌ను క్రికెట్ భాషలో చక్కర్ అని సంబోధిస్తారు. అందుకే అక్తర్ బౌలింగ్‌ను ఐసీసీ కొంతకాలం బ్యాన్ చేసింది. ఇక ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్ యాంగిల్ కాస్త డౌన్‌లో వస్తుంది.. అందువల్ల అతని బౌలింగ్ పెద్ద కష్టంగా అనిపించదు. షోయబ్ బౌలింగ్‌లో మాత్రం బంతి ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు. అందుకే అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించేది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ కూడా నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో ఒకడు. అతని స్వింగ్ బౌలింగ్ ఎక్కువగా ఆఫ్‌స్టంప్ అవతల పడుతూ బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టేవి. ఇక బ్రెట్ లీ బౌలింగ్‌లో ఆడడం పెద్దగా భయం లేనప్పటికి.. అక్తర్‌ను మాత్రం మనం నమ్మలేం. అతను సంధించే బీమర్.. యార్కర్ ఎక్కడ నా కాలుకు తగులుతుందోనని భయపడేవాడిని. కానీ బ్యాటింగ్ మాత్రం ఎప్పుడు కంఫర్ట్‌గానే ఉండేది.'' అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు.
కాగా... సెహ్వాగ్.. పాకిస్తాన్ తో తొమ్మిది టెస్టు మ్యాచులు ఆడాడు. 91.14 సగటుతో 1,276 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌పై ట్రిపుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, సెంచరీ సాధించాడు.
