మూడో టెస్టు ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా మిగిలిన రెండు టెస్టుల నుంచి కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. మొదటి రెండు టెస్టుల్లో బరిలో దిగని కెఎల్ రాహుల్‌ను, చివరి రెండు టెస్టుల్లో ఆడించాలని భావించింది టీమిండియా.

అయితే మెల్‌బోర్న్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయపడిన కెఎల్ రాహుల్, మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడానికి మూడు వారాల విశ్రాంతి అవసరమని సూచించాడు భారత ఫిజియో..

గాయంతో స్వదేశానికి బయలుదేరిన కెఎల్ రాహుల్, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటాడని బీసీసీఐ సెక్రటరీ జే షా మీడియాకు ప్రకటన ద్వారా తెలియచేశారు. కెఎల్ రాహుల్ గాయంతో స్వదేశానికి బయలుదేరడంతో హనుమ విహారి, మయాంక్ అగర్వాల్‌లలో ఒకరికి మూడో టెస్టులో మరో అవకాశం దక్కనుంది.