బుధవారం జరిగిన మ్యాచ్ లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)చేతిలో ఓటమి పాలై.. ట్రోఫీ కోసం జరుగుతున్న పోరు నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆర్సీబీ ప్లేయర్ రజత్ పాటిదార్ విధ్వంసాన్ని లక్నో తట్టుకోలేకపోయింది. ఫలితంగా ఓటమి పాలైంది.

ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెంట్స్ (LSG) అదరగొట్టిందనే చెప్పాలి. కొత్త జట్టు అయినప్పటికీ.. మొదటి నుంచి అన్ని జట్లకు పోటీ చేస్తూ.. ప్లేఆఫ్ కి చేరింది. కానీ.. బుధవారం జరిగిన మ్యాచ్ లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)చేతిలో ఓటమి పాలై.. ట్రోఫీ కోసం జరుగుతున్న పోరు నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆర్సీబీ ప్లేయర్ రజత్ పాటిదార్ విధ్వంసాన్ని లక్నో తట్టుకోలేకపోయింది. ఫలితంగా ఓటమి పాలైంది.

Also Read: IPL2022: రజత్ పాటిదార్ అరుదైన రికార్డ్.. కోహ్లీ రియాక్షన్ ఇదే..!

ఈ కీలక మ్యాచ్‌లో లక్నో 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో టోర్నీ నుంచి ఆ జట్టు నిష్క్రమించగా.. రాజస్థాన్ రాయల్స్‌తో ఆర్‌సీబీ క్వాలిఫయర్-2కు సిద్దమైంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రాహుల్.. కీలక క్యాచ్‌లు నేలపాలు చేయడంతోనే విజయవకాశాలు దెబ్బతిన్నాయన్నాడు. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు అద్భుతంగా ఫీల్డింగ్ చేసిందని కొనియాడాడు. పటిదార్ కూడా అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని మెచ్చుకున్నాడు.

'ఫీల్డింగ్ వైఫల్యం మా ఓటమికి కారణమైంది. సులువైన క్యాచ్‌లు నేలపాలు చేస్తే.. ఫలితం ప్రతికూలంగానే ఉంటది. పటీదార్ అద్భుత ఇన్నింగ్స్ కూడా ఓటమికి ఓ కారణం. టాప్-3 బ్యాటర్లలో ఏ ఒక్కరు సెంచరీ చేసినా ఆ జట్టు సునాయసంగా గెలుస్తుంది. ఆర్‌సీబీ అద్భుతంగా ఫీల్డింగ్ చేసింది. మేం మాత్రం మరి దారుణమైన ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకున్నాం. ఈ సీజన్‌లో మాకు ఎన్నో సానుకూలంశాలు ఉన్నాయి. ఇదో కొత్త ఫ్రాంచైజీ. అన్ని జట్లలానే మేం కొన్ని తప్పిదాలు చేశాం. వచ్చే సీజన్‌‌లో మరింత బలంగా బరిలోకి దిగుతాం. ఇది పూర్తిగా యువ జట్టు.. ఆటగాళ్లు తమ తప్పిదాల నుంచి గుణ పాఠం నేర్చుకుంటారు. మోహ్‌సిన్ అద్భుతమైన బౌలింగ్‌తో సత్తా చాటాడు. అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. వచ్చే సీజన్‌కు అతను మరిన్నీ నైపుణ్యాలు నేర్చుకొని వస్తాడు.'అని రాహుల్ తెలిపాడు.