ఈ ఓటమితో లక్నో టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. బెంగళూరు జట్టు శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్(RR)తో క్వాలిఫయర్-2లో తలపడనుంది.
ఐపీఎల్ 2022లో ఆర్సీబీ దూసుకుపోతోంది. కాగా.. తాజాగా బుధవారం జరిగిన మ్యాచ్ తో ఆర్సీబీలో ఓ కొత్త హీరో... క్రికెట్ ప్రియులకు పరిచయం అయ్యాడు. అతనే రజత్ పాటిదర్. ఐపీఎల్ లో అరుదైన రికార్డు సాధించి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు.
లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో బుధవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతులాడిన రజత్ పాటిదార్ 12x4, 7x6 సాయంతో అజేయంగా 112 పరుగులు చేశాడు. దాంతో.. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. లక్ష్యఛేదన ఆఖర్లో తడబడిన లక్నో టీమ్ 193/6కి పరిమితమైంది. ఈ ఓటమితో లక్నో టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. బెంగళూరు జట్టు శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్(RR)తో క్వాలిఫయర్-2లో తలపడనుంది.
లక్నోపై సెంచరీ బాదిన రజత్ పాటిదార్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో శతకం నమోదు చేసి ఫస్ట్ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నిలిచాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడని ఓ బ్యాటర్ ప్లేఆఫ్స్‌లో సెంచరీ నమోదు చేయడం ఇదే తొలిసారి.
కాగా... రజత్ పాటిదార్ ఆటకు అందరూ విస్మయానికి గురయ్యారు. అందరూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో.. రజత్ ఆటపై ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు.
రజత్ ఆటకు తాను విస్మయం చెందానని కోహ్లీ పేర్కొన్నాడు. ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ దశలో సెంచరీ చేసిన తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ పటీదార్ అని కోహ్లీ హైలైట్ చేశాడు.
"నేను చాలా సంవత్సరాలుగా ఒత్తిడిలో ఎన్నో ఇంపాక్ట్ ఇన్నింగ్స్‌లు, చాలా ఇన్నింగ్స్‌లను చూశాను. ఈరోజు రజత్ ఎలా ఆడాడు అనే దానికంటే మెరుగైనవి నేను చూడలేదు. మొదటి అన్‌క్యాప్డ్ ప్లేయర్, ' అని కోహ్లీ అన్నాడు.
కాగా.. నిజానికి గత సీజన్ వరకు రజత్ పాటిదార్ బెంగళూరులో భాగంగా ఉన్నాడు. కానీ.. మెగా వేలం కారణంగా అాతన్ని రిటైన్ చేయలేదు. అప్పటికీ బెంగళూరు లేదా మరేదైనా జట్టు అతని వేలంపై వేలంలో కచ్చితంగా పందెం కాస్తుందని అనిపించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలంలో రెండుసార్లు వేలానికి వచ్చినా అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. చివరగా.. ఈ యువ బ్యాట్స్ మెన్ ని బెంగళూరు కొనుగోలు చేసింది. కేవలం రూ.20లక్షల బేస్ ప్రైజ్ తో కొనుగోలు చేయడం గమనార్హం.
