Riyan Parag: ఐపీఎల్ 2025 కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రియాన్ ప‌రాగ్ వ‌రుస‌గా ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాది సంచ‌ల‌నం రేపాడు. అద్భుత‌మైన ఆట‌తో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ బౌలింగ్ ను దంచికొట్టాడు.  

Riyan Parag hits 6 sixes in 6 consecutive balls: ఐపీఎల్ 2025 కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రియాన్ ప‌రాగ్ వ‌రుస‌గా ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాది సంచ‌ల‌నం రేపాడు. అద్భుత‌మైన ఆట‌తో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ బౌలింగ్ ను దంచికొట్టాడు.


ఐపీఎల్ 2025 53వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో రాజ‌స్థాన్ స్టార్ రియాన్ ప‌రాగ్ త‌న బ్యాటింగ్ సునామీ చూపించాడు. వ‌రుస‌గా ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాది సంచ‌ల‌నం రేపాడు. అద్భుత‌మైన ఆట‌తో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ బౌలింగ్ ను దంచికొట్టాడు.

మొయిన్ అలీ 13 ఓవ‌ర్ లో బౌలింగ్ చేయ‌డానికి వ‌చ్చాడు. ఈ ఓవ‌ర్ లో హిట్మేయర్ ఫస్ట్ బాల్ కు ఒక పరుగులు చేసి రియాన్ పరాగ్ కు స్ట్రైక్ ఇచ్చాడు. రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్ లో పరాగ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. దీంతో మొయిన్ అలీ వేసిన ఈ ఓవర్ లో 32 పరుగులు వచ్చాయి. 

ఆ తర్వాత 14 ఓవర్ ను వరుణ్ చక్రవర్తి వేయడానిక వచ్చాడు. ఈ ఓవర్ లో రియాన్ పరాగ్ ఎదర్కొన్న మరో బంతికి సిక్సర్ బాదాడు. ముందు ఓవర్ లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రియాన్ పరాగ్.. తర్వాత ఓవర్ లో ఎదుర్కొన్న తన 6వ బంతికి కూడా సిక్సర్ బాదాడు. దీంతో వరుసగా 6  బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి రికార్డుల మోత మోగించాడు. 

 

Scroll to load tweet…

 

Scroll to load tweet…

ఐపీఎల్ లో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదిన ప్లేయ‌ర్లు 

1. క్రిస్ గేల్ vs రాహుల్ శర్మ, 2012
2. రాహుల్ తెవాటియా vs ఎస్ కాటెరెల్, 2020
3. రవీంద్ర జడేజా vs హర్షల్ పటేల్, 2021
4. రింకు సింగ్ vs యశ్ దయాళ్, 2023
5. రియాన్ పరాగ్ vs మొయిన్ అలీ, 2025