ఇండియన్ క్రికెటర్ కరుణ్ నాయర్ పేరు గుర్తుండే ఉంటుంది. అదేనండి ట్రిపుల్ సెంచరీ వీరుడు. ఇప్పుడు గుర్తు వచ్చే ఉంటుంది కదా. ఇంతకీ మ్యాటరేంటంటే... కరుణ్ నాయర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు సనాయా తకరివాలా తో ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం.

తాను ఎంగేజ్ మెంట్ చేసుకున్నాను అనే విషయాన్ని కరుణ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సనాయా.. ప్రేమగా కరుణ్ ని ముద్దాడుతున్న ఫోటోని కరుణ్ షేర్ చేశాడు. ఆ ఫోటోలో సనాయా చేతికి కరుణ్ తొడిగిన ఉంగరం కూడా ఉంది. అతని ప్రేయసి సనాయా కూడా ఆ ఫోటోలను షేర్ చేసింది. 

2016లో కరుణ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కరుణ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. దేశవాలీ క్రికెట్, రంజీ క్రికెట్ కరుణ్ నాయర్ తన సత్తా చాటుతున్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

She said ‘YES’❤️💍

A post shared by Karun Nair (@karun_6) on Jun 29, 2019 at 4:16am PDT