Kapil Dev: "అతిగా ఆశలు పెట్టుకోవద్దు.. ఆటను ఆటగా మాత్రమే చూడాలి"  

Kapil Dev: భార‌త్ లో క్రికెట్ అంటే పిచ్చి.. క్రికెట్ ను ఆటగా కాదు.. ఓ మ‌తంలా ఆదరిస్తారు. క్రికెట్‌ను ఇంత‌లా ఆద‌రించ‌డానికి కారణం 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భారత్ విజ‌యం సాధించడమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  ఆనాటి టీమిండియాకు  సారథ్యం వహించిన క‌పిల్ దేవ్..  వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంపై స్పందించారు. 

Kapil Dev on India  World Cup campaign KRJ

Kapil Dev: భార‌త్ లో క్రికెట్ అంటే పిచ్చి.. క్రికెట్ ను ఆటగా కాదు.. ఓ మ‌తంలా ఆదరిస్తారు. క్రికెట్‌ను ఇంత‌లా ఆద‌రించ‌డానికి కారణం 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భారత్ విజ‌యం సాధించడమే. ఎలాంటి ఆశలు లేకుండా వర్డల్ కప్ టోర్నీలోకి ఏంట్రీ అయినా.. క‌పిల్ దేవ్ సార‌థ్యంలో టీమిండియా అంచనాలకు మించి పోరాడింది. ఫైనల్ మ్యాచ్ లో ఆర‌వీర‌భ‌యంక‌ర‌మైన వెస్టిండీస్ జ‌ట్టును ఓడించి తొలి సారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో క‌పిల్ సేన సాధించిన విజ‌యం చిరస్మరనీయం. తాజాగా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంపై స్పందించారు. 

గ్రాంట్ థార్న్టన్ ఇన్విటేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్ యొక్క మొదటి టీ ఆఫ్ ప్రోగ్రాం సందర్భంగా క‌పిల్ మాట్లాడుతూ..  మితిమీరిన ఆశలు హృదయాలను విచ్ఛిన్నం చేస్తాయి. సమతుల్యంగా వ్యవహరించడం చాలా ముఖ్యం అని అన్నాడు.భారత అభిమానులు అంత ఒత్తిడికి గురికావద్దని, క్రికెట్‌ను ఇతర క్రీడల్లాగే చూడాలని అన్నాడు. భారత్ వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచినా ఫైనల్‌లో ఓడిపోయింది. గత పదేళ్లలో ఎనిమిది ఐసీసీ టోర్నీల్లో ఏడింటిలో భారత్ నాకౌట్‌లో ఓడిపోయింది.

కపిల్ ఇంకా మాట్లాడుతూ.. “నేటి ఆటగాళ్లు మాత్రమే వారు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో చెప్పగలరు. భారత్‌ గెలిస్తే బాగుంటుంది. మనం కొన్ని లోటుపాట్లపై దృష్టి పెట్టాలి. విజయం తర్వాత కూడా లోటుపాట్లు మిగిలి ఉన్నాయని, వాటిని తొలగించుకోవడమే ముఖ్యమని అన్నారు. భారత్ వరుసగా పది మ్యాచ్‌ల్లో విజయం సాధించిందని కపిల్ అన్నాడు. ఇది చాలదా? మేము ఇతర జట్లను కూడా చూడాలి. పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మరి బాగా ఆడామా లేదా అన్నది చూడాలి. టీమిండియా చాలా బాగా ఆడింది. కానీ, ఫైనల్ రోజు మాది కాదు. ’’అని అన్నారు. 

దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లను చూడండి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలిచింది. ఆఖరి ఓటమి తర్వాత ఆటగాళ్లను ఓదార్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ భారత డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించారని కొనియాడారు. “ప్రధానమంత్రి ప్రోత్సహించకపోతే.. ఎవరు ప్రోత్సహిస్తారు?” అని ఆయన అన్నారు. ప్రధాని దేశంలోనే నంబర్ వన్ వ్యక్తి, అతని మద్దతు లభించడం ఆనందంగా ఉందని అన్నారు. 

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవిష్యత్తుపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన కపిల్ దేవ్.. అది సెలెక్టర్ల పని,వారికే వదిలివేయాలని సూచించారు. ప్రతిదానిపై వ్యాఖ్యానించడం మంచిది కాదనీ, సెలక్టర్లు  బాధ్యత వహిస్తారని అన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios