గిల్ అద్భుతమైన ప్రదర్శనపై కపిల్ దేవ్ ప్రశంసలు..!
అతని ఇన్నింగ్స్ లో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో విఫలమైన గిల్, ఆ తర్వాత అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చాడు. కాగా, గిల్ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్ సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించాడు.
ఆసియాకప్ 2023లో టీమిండియా అదరగొట్టింది. ముఖ్యంగా ఫైనల్ లో అయితే శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించేసింది. శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో, ఎనిమిదోసారి టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. అయితే, ఈ టోర్నీలో టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. ఈ మెగా ఈ వెంట్ లో మొత్తం గిల్ 6 మ్యాచ్ లు ఆడాడు. ఈ 6 మ్యాచుల్లో 302 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అతని ఇన్నింగ్స్ లో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో విఫలమైన గిల్, ఆ తర్వాత అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చాడు. కాగా, గిల్ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్ సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించాడు.
ఓవరాల్ గా ఈ ఏడాది ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్ లు ఆడిన గిల్ 68.33 సగటుతో 1035 పరుగులు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో శుభమన్ గిల్ పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు. గిల్ ను ఫ్యూచర్ ఆఫ్ భారత్ క్రికెట్ అని కపిల్ దేవ్ పొగడ్తల వర్షం కురిపించారు. శుబ్ మన్ గిల్ ఒక అద్భుతం అని అన్నారు. గిల్ భారత్ క్రికెట్ కి భవిష్యత్తు అన్నారు. ఈ యువ క్రికెటర్ కచ్చితంగా భారత్ క్రికెట్ ని అత్యున్నత స్థాయికి తీసుకువెళతాడని నమ్మకం ఉందన్నారు. ఇలాంటి అద్భుతమైన ఆటగాడు ఇండియన్ టీమ్ లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు.