హామిల్టన్: మూడో వన్డేలో ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. తమకు సూపర్ ఓవర్ అనేది కలిసి రావడం లేదని, అందుకే తాము మామూలు మ్యాచుల్లోనే గెలవాలని ఆయన అన్నాడు. క్రికెట్ ఎంతో గొప్ప క్రీడ అని, ఏ చిన్న తప్పు దొర్లినా విజేత మారిపోతుందని ఆయన అన్నాడు.

కీలకమైన సమయాల్లో, ఒత్తిడి ఉన్న సమయాల్లో ఇండియా తన అనుభవాన్ని వాడుుకని విజయం సాధించిందని ఆయన అన్నాడు. ఈ విషయంలో తాము ఇండియా నుంచి చాలా నేర్చుకోవాలని ఆయన అన్నాడు. టీమిండియా ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించినా తమ బౌలర్లు తేరుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాడు. 

Also Read: తెలియక బ్యాగ్ సర్దేసుకున్నా: సూపర్ ఓవర్ ప్లాన్ పై రోహిత్ శర్మ

రెండు జట్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాయని, ఈ రోజు తన బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నానని, మిడిల్ ఆర్డర్ లో భాగస్వామ్యాలు నెలకొల్పానని ఆయన అన్నాడు. అయితే మ్యాచును విజయంతో ముగించకపోవడం దురదృష్టకరమని అన్నాడు. 

ఓటమి చవి చూసినందువల్ల పిచ్ ను తప్పు పట్టడానికి ఏమీ లేదని, బ్యాటింగ్ కు బాగా అనుకూలించిందని, ఓటమి గురించి సభ్యులతో చర్చించాలని ఆయన అన్నారు. తాము మరింత మెరుగుపడాలని అన్నాడు. ముఖ్యంగా ఒత్తిడిలో విజయం సాధించడం నేర్చుకోవాలని అన్నాడు. 

Also Read: చివరి ఓవరులో పేసర్ షమీ తడాఖా: సూపర్ రో'హిట్

మ్యాచును గెలిచి సిరీస్ ను కాపాడుకోవాల్సిన మూడో వన్డేలో న్యూజిలాండ్ భారత్ పై పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచుల్లో చతికిలపడిన న్యూజిలాండ్ మూడో వన్డేను గెలుచుకున్నంత పని చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ అసాధారణమైన బ్యాటింగ్ ప్రతిభను కనబరిచాడు. 

48 బంతుల్లో 95 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. దాంతో న్యూజిలాండ్ విజయం ఖాయంగా కనిపించింది. అయితే చివరి ఓవరులో ఇండియా బౌలర్ మొహమ్మద్ షమీ రెండు వికెట్లు తీసి మ్యాచును మలుపు తిప్పాడు. చివరకు మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవరు ద్వారా ఇండియా విజయం సాధించింది.

ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది. మూడు మ్యాచులు గెలిచి ఇప్పటికే ఇండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా ఇండియా అడుగులు వేస్తోంది.