Asianet News TeluguAsianet News Telugu

722 రోజుల తర్వాత కేన్ మామ సెంచరీ.. తొలి టెస్టులో పట్టుబిగిస్తున్న కివీస్

PAKvsNZ:  పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ కరాచీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పట్టు బిగిస్తున్నది.   పాకిస్తాన్ కు దీటుగా బ్యాటింగ్ చేస్తున్నది.  ఆ జట్టు మాజీ సారథి (టెస్టులకు)  కేన్  విలియమ్సన్ సెంచరీతో మెరిశాడు.

Kane Williamson and Tom Latham Centuries Helps New Zealand To Lead in Karachi Test
Author
First Published Dec 28, 2022, 6:56 PM IST

విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్ తర్వాత   క్రికెట్ అభిమానులు ఫాబ్ 4 గా పిలుచుకునే ఆటగాళ్ల జాబితాలో  కివీస్  సారథి (వన్డే, టీ20లకు)  కేన్ విలియమ్సన్ కూడా ఉంటాడు. ఈ నలుగురిలో   గత రెండేండ్లలో  రూట్ మినహా  మిగిలిన ముగ్గురూ  పేలవ ఫామ్ తో సతమతమయ్యారు. కానీ  ఈ ఏడాది మాత్రం ఈ ముగ్గురికీ శతకాల కరువు తీర్చింది. 2019 తర్వాత ఈ ఏడాది  విరాట్ కోహ్లీ మళ్లీ మూడంకెల స్కోరు చేయగా  స్టీవ్ స్మిత్ కూడా స్వదేశంలో సెంచరీలు బాదుతున్నాడు. తాజాగా కేన్ మామ కూడా  పాకిస్తాన్ తో టెస్టు సిరీస్ లో బ్యాట్ ఝుళిపించాడు. 722 రోజుల తర్వాత శతకం బాదాడు. 

కేన్ మామ చివరిసారిగా  టెస్టులలో 2021 జనవరిలో  సెంచరీ చేశాడు.  ఆ తర్వాత  అతడు టెస్టులలో  మళ్లీ మూడంకెల స్కోరుకు చేరలేదు.  యాధృశ్చికంగా  అప్పుడు సెంచరీ చేసింది కూడా పాకిస్తాన్ మీదే కావడం గమనార్హం.   ఇక కరాచీ టెస్టులో   అతడు 206 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో  సెంచరీ అందుకున్నాడు. టెస్టులలో అతడికి ఇది 25వ సెంచరీ. పాక్ పై ఐదో శతకం. 

కేన్ విలియమ్సన్ సెంచరీ (105 నాటౌట్) తో పాటు  ఓపెనర్ టామ్ లాథమ్ కూడా హండ్రెడ్ బాదడంతో తొలి టెస్టులో కివీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్.. 438 పరుగులు చేయగా  న్యూజిలాండ్  మూడో రోజు ఆట ముగిసే సమయానికి  ఆరు వికెట్ల నష్టానికి 440 పరుగులు చేసింది.  టామ్ లాథమ్ (113), డెవాన్ కాన్వే (92) లు తొలి వికెట్ కు  183 పరుగులు జోడించారు.  ఆ తర్వాత  హెన్రీ నికోలస్ (22) విఫలమైనా  డారిల్ మిచెల్ (42), టామ్ బ్లండెల్ (47) ఫర్వాలేదనిపించారు.  ప్రస్తుతం  విలియమ్సన్ తో పాటు  ఇష్ సోధి (1 నాటౌట్)  క్రీజులో ఉన్నారు. 

 

పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా  నౌమన్ అలలీ  రెండు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ వసీం జూనియర్ కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో   పాక్ తరఫున బాబర్ ఆజమ్  (161) తో పాటు అగా సల్మాన్ (103) లు సెంచరీలు చేయడంతో  పాక్  భారీ స్కోరు సాధించింది.  మరో రెండ్రోజులే మిగిలుండటం, ఇప్పటికీ  తొలి ఇన్నింగ్స్ కూడా మొదలుకాకపోవడంతో  ఈ టెస్టులో అద్భుతాలేమైనా జరిగితే తప్ప పేలవమైన డ్రా గా ముగియడం  ఖాయంగా అనిపిస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios