వాషింగ్టన్: ఐపిఎల్ 2020 నుంచి తాను ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించినప్పటికీ జోఫ్రా ఆర్చర్ వార్తల్లో ఉన్నాడు. ఐపిఎల్ 2020లో అతను విశేషమైన ప్రదర్శన కనబరించాడు. 14 ఇన్నింగ్సు ఆడి 20 వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. దీనికి అతను ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాడు. మరో కారణం వల్ల కూడా జోఫ్రా ఆర్చర్ వార్తల్లో నిలిచాడు. 

జోఫ్రా ఆర్చర్ ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అతను 2014 అక్టోబర్ 4వ తేదీన చేసిన ట్వీట్ అది. జో బైడెన్ అమెరికా ఎన్నికల్లో గెలుస్తాడని ఆయన ట్వీట్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ అంచనా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిజమైంది. 

జోఫ్రా ఆర్చర్ జోస్యం నిజానికి సంప్రదాయానికి చెందింది. ఆర్చర్ జోస్యం బాగా చెప్పగలడని అతని అభిమానులు భావిస్తారు. ఆర్చర్ చాలా సార్లు వివిధ సంఘటనల గురించి మూందే అంచనా వేసి చెబుతాడని అంటారు. 

 

ఇటీవల ఐపిఎల్ భాగంగా  జరిగిన మ్యాచులో ఆర్చర్ క్రిస్ గేల్ ను 99 పరుగుల వద్ద పెవిలియన్ చేర్చాడు. దాంతో గేల్ సెంచరీ మిస్సయ్యాడు. దాంతో ఆర్చర్ ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్ వైరల్ కావడం ప్రారంభించింది. 

 

మోడీ మార్చిలో విధించిన 21 రోజుల లాక్ డౌన్ విషయాన్ని కూడా ఆర్చర్ ముందుగానే చెప్పాడని అంటున్నారు. 2019 ప్రపంచ కప్ లో సూపర్ ఓవరు గురించి కూడా ఆర్చర్ ముందుగానే చెప్పాడని అంటుున్నారు. 

వివిధ విషయాలపై ఆర్చర్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నప్పటికీ వాటికి ప్రస్తుత ప్రాసంగికతకు పెద్దగా సందర్భం లేదు. ఆర్చర్ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై చేసిన ట్వీట్ నిజమైనప్పటికీ దానికి పెద్దగా ప్రాసంగికత లేదు. అయితే, ఆర్చర్ అభిమానులు మాత్రం దాన్ని వైరల్ చేస్తున్నారు.