. ఆ ఫోటోకి సన్ షైన్ స్మైలీస్ అంటూ సంజనా క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం.  కాగా.. ఈ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  


టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా పై ప్రస్తుతం ఎక్కడా చూసినా ప్రశంసల వర్షం కురుస్తోంది. గత జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డ‌బ్ల్యూటీసీ)లో న్యూజిలాండ్‌పై ఒక్క వికెట్‌ తీయకపోయినా.. తాజాగా ఇంగ్లండ్‌తో ఆడిన తొలి టెస్టులో మొత్తం 9 వికెట్లు తీసి మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ నడ్డివిరిశాడు. ఈ క్రమంలోనే బుమ్రా బౌలింగ్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బుమ్రా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాగా.. ఈ ఆనందాన్ని బుమ్రా.. తన భార్య సంజనాతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా.. బుమ్రా, సంజనలు ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫోటోలో వారిపై లేలేత సూర్య కిరణాలు పడుతున్నాయి. కాగా.. ఆ ఫోటోకి సన్ షైన్ స్మైలీస్ అంటూ సంజనా క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం. కాగా.. ఈ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

ఆ ఫోటోకి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. కొందరు మీ ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారంటూ కామెంట్ చేయగా.. మరికొందరు ఒకరి కోసం మరొకరు పుట్టినట్లుగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View post on Instagram

ఇదిలా ఉండగా.. బుమ్రా, సంజనాలు ఈ ఏడాది మార్చిలో పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి తేదీ దగ్గరపడే వరకు.. బుమ్రా ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడనే విషయం దాదాపు బయటకు రానివ్వకపోడం గమనార్హం. బుమ్రా పెళ్లి ఆ హీరోయిన్.. ఈ హీరోయిన్ తో అంటూ వచ్చిన వార్తలన్నింటికీ పులిస్టాప్ పెట్టి.. క్రికెట్ కామెంటేటర్ సంజనాని బుమ్రా ప్రేమ వివాహం చేసుకున్నారు.