ఐపీఎల్‌లాగే బీబీఎల్‌లోనూ చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సిడ్నీ థండర్స్, ఆడిలైడ్ స్ట్రైయికర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆడిలైడ్ స్టైయికర్స్ ఓపెనర్ జాక్ వీథర్‌రాల్డ్ ఒకే బంతికి రెండు సార్లు రనౌట్ అయ్యాడు.

26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన జాక్... క్రిస్ గ్రీన్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. బ్యాట్స్‌మెన్ ఆడిన షాట్ గ్రీన్ చేతికి తగులుతూ నాన్‌స్ట్రైయికింగ్ ఎండ్‌లో వికెట్లను గిరాటేసింది.


థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించేలోపు జాక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. ఈలోపు బంతిని అందుకున్న వికెట్ కీపర్, స్టంప్‌ను పడగొట్టాడు. ఒకే బంతికి రెండు సార్లు రనౌట్ అయ్యాడు జాక్ వీథర్‌రాల్డ్. ఇదే మ్యాచ్‌లో హెడ్ కూడా ఇదే విధంగా నాన్‌ స్టైయింగ్ ఎండ్‌లో వికెట్లకు బంతి తగలడంతో రనౌట్ అయ్యాడు.

ఇదే మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ బౌలర్ ఆడమ్ మిల్నే నాలుగు ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి, 20 డాట్ బాల్స్ వేసి అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.